Home monthJanuary పెళ్ళికి చెందిన చెడు సంప్రదాయాలను త్యజించాలి

పెళ్ళికి చెందిన చెడు సంప్రదాయాలను త్యజించాలి

by Akhand Jyoti Magazine

Loading


మానవ సమాజాన్ని సంఘటితం చేసి, అభివృద్ధి చెందిం
చటంలో వివాహ వ్యవస్థ ప్రముఖపాత్ర వహించిందనటంలో
ఎలాంటి సందేహము లేదు. తద్వారా మనుష్యులు పెద్దపెద్ద
కుటుంబాలలో సమ్మిళితమై, సహకార భావనను మరింత
అధికంగా ఉపయోగించుకొని మహత్త్వపూర్ణమైన కార్యములను
నిర్వహించగలిగారు. అందుచేతనే భారతీయ తత్త్వవేత్తలు
వివాహానికి ఒక ధర్మకార్యమనే రూపాన్ని ఇచ్చి, భార్యాభర్తల
సంబంధం నిశ్చితమైనదీ, పవిత్రమైనదిగా భావించాలనీ,
ఒకటి ఒకటి కలిస్తే 11 కు సమానము కావాలనీ ప్రకటించారు.
కాలక్రమేణా ఈ కుటుంబవ్యవస్థయే జాతికి ఆధారంగా
మారింది, దాని నుండే దేశాలు నిర్మించబడ్డాయి.
ఈ ప్రకారంగా “వివాహవ్యవస్థ” ప్రచారంలోనికి వచ్చిన
తదుపరి వేర్వేరు ప్రదేశాలలో ఆయా ప్రదేశములకు మేలైన
రీతిలో వివాహానికి సంబంధించిన రీతి-రివాజు (పద్ధతులు
– సాంప్రదాయాలు) లలో కొంత తేడా తప్పనిసరిగా ఏర్పడి
ఉన్నప్పటికీ ‘కన్య యొక్క తండ్రి ఒక యోగ్యుడైన వరుడిని
చూసి, పురోహితుడి ద్వారా కొన్ని ధార్మిక కృత్యములను
నిర్వహించి తన కుమార్తెను వరుడికి అర్పించేవారు.
అమ్మాయిని భర్తతో పంపించే సమయంలో గృహ
నిర్వహణకు అవసరమైన కొంత ధాన్యము, బట్టలు, వంట
పాత్రలు ఇచ్చి పంపించటం” అనేది ప్రముఖంగా “వివాహం”
యొక్క స్వరూపంగా ఏర్పడియున్నది.


ప్రాచీన స్మృతులు, పురాణాలలోని ఉపాఖ్యానములలో
వివాహ ప్రణాళికల గురించి వర్ణించబడియున్నది. కానీ
అందులో ఎక్కడా వివాహానికి ముందు కట్నం రూపంలో
ధనాన్ని జమచెయ్యటం, పెద్దపెద్ద ఊరేగింపులు జరపటం,
రోజుల తరబడి నృత్యాలు, సంగీతాలు, విందువినోదాలతో
గడపటంలాంటివి ఉన్నట్లు చెప్పబడలేదు. దేవతలను సాక్షులుగా
మనస్ఫూర్తిగా భావిస్తూ వైవాహిక ప్రతిజ్ఞలు చేసే పద్ధతి
ఉన్నట్లు పురాణాలలో విస్తారంగా వర్ణింపబడియున్నది. అంతే
కాని రకరకాలైన మర్యాదలు, బహుమతుల నివ్వటం, ఖర్చుతో
కూడిన ఆడంబరాలు జరుపబడినట్లుగా ఎక్కడా మనకు
కనబడదు. అయితే కొన్ని కావ్యాలు, మహాకావ్యాలలో
వివాహంలో జరిగే వైభవాన్ని గురించి విస్తృతమైన వర్ణన
ఉన్నది. కానీ అది ఆనాటి కవులు అప్పటి సమయానుకూలంగా
వ్రాసియున్నట్లు మనం భావించాలి.


వివాహం జరుపబడే రకరకాల వైవిధ్యాన్ని బట్టి అది
వివిధ ప్రదేశాలలో వివిధ రీతులలో జరుగుతుండేది. ఒకచోట
ఆడపిల్ల కలవాళ్ళు పిల్లవాని పెద్దలకు కట్నం రూపంలో
వేల రూపాయలు ఇస్తుండేవారు, మరొకచోట పిల్లవాడి పెద్దలే
అమ్మాయికి వందలు, వేలు ఇస్తుండే ఆచారం ఉండేది. కొన్ని
చోట్ల నాలుగు గోత్రముల మధ్య వివాహ సంబంధాలు
నిశ్చయించబడుతుండేవి. కొన్ని ప్రదేశములలో ఉన్నతులుగా
చెప్పబడే బ్రాహ్మణులు కూడా మేనమామ, మేనత్త బిడ్డలకు
తమ పిల్లల నిచ్చి వివాహం చేసేవారు.
ఈనాడు వివాహాలలో అన్నింటికన్నా పెద్ద చెడ్డ అలవాట్లు
ఏర్పడటం వల్ల అవి వివాహాన్ని అత్యంత ఖరీదైన వానిగా
చేసివేస్తున్నాయి. వివాహమనేది తప్పనిసరిగా హర్హోల్లాసము
లతో నిండిన ఉత్సవమే! అంతేకాదు. ఆ సందర్భంలో రెండు
ఆత్మలు, రెండు కుటుంబాల మధ్య ఒక లోతైన సంబంధం
స్థాపించబడుతుంది.

తద్వారా రాబోవు కాలంలో ఎన్నో శుభపరిణామాలు
ఉత్పన్నమయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఆ సమయంలో
మానవుడికి ఒంటరితనం దూరమై, ఒక జీవనసహచరి లభిస్తుంది. సుఃఖదుఃఖాలలో, కలిమిలేములలో ఆమె నుండి
సంపూర్ణమైన సహకారం లభిస్తుందన్న భరోసా ఉంటుంది.
అందుచేత వివాహ శుభసందర్భంగా పదిమంది స్నేహితు
లను, దగ్గరివాళ్ళను పిలిచి, విందు ఏర్పాటుచేసి వాళ్ళతోటి
సంతోషంగా సమయం గడపటంలో ఔచిత్యం ఉన్నది. అలాగే
వధూవరుల తల్లిదండ్రుల తరపువారి నుండీ వారిద్దరకూ
కొన్ని కానుకలను ఇప్పించటంలోనూ కూడా ఎలాంటి దోషం
ఉండదు. శాస్త్ర పద్ధతులననుసరించి పాణిగ్రహణం చెయ్యటం
తోపాటు కొంచెం ఉల్లాసం-ఉత్సాహంతో కూడిన మనోరంజక
మైన కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకున్నట్లయితే గనుక దానిని
జీవితంలోని ఒక ప్రత్యేక సంఘటనగా అప్పుడప్పుడూ
గుర్తుచేసుకునేటందుకు వీలు కలుగుతుంది. కానీ ఇవే
అంశములు ఒక పిచ్చిగా, మోజుగా మారితే అది మన
జీవితాల యొక్క ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలోనికి నెట్టివేస్తుంది.
అందుచేతనే ఈనాడు ప్రజలు వివాహాల మూలంగా
ఎంతో అశాంతికి గురౌతున్నారు. ప్రత్యేకించి “ఆడపిల్ల పెండ్లి”
అంటే భగవంతుడికి మనపై కోపం వస్తే ఎంతగా భయ
పడతామో అలా భయపడవలసిన పరిస్థితి ఎదురవుతున్నది.
ప్రస్తుతకాలంలో కొంతమంది గొప్ప కుటుంబాలలోని వ్యక్తులు
క్రొత్త క్రొత్త ఖర్చులను పెంచి వివాహవ్యవస్థను ఎంత ఖరీదైన
కార్యక్రమంగా తయారుచేశారంటే… సాధారణ స్థితిగతులలో
జీవించే వ్యక్తి పైన చెప్పిన రీతిలో ‘పెండ్లి’ చెయ్యాలంటే
దివాళా తీయటమే కాక; దాని తాలూకు దుష్పరిణామాలను
అతడు సంవత్సరాల తరబడి సహించవలసివుంటుంది.

పెండ్లిండ్ల సమయంలో అయ్యే అపవ్యయం (అనవసరపు
ఖర్చు) మన సమాజంలో ఉన్న అన్నిటికన్నా పెద్ద దురలవాటు.
వరుడి తరపువారు “వధువు తల్లిదండ్రుల ఇల్లు-వాకిలీ ఊప్పి స్వామి వివేకానంద జయంతి
ఉన్న మొత్తాన్నంతటినీ తీసుకొనవలెననీ, ఇంకా వీలయితే
వధువు తండ్రి అప్పుచేసి ఎంత ఇవ్వగలిగితే అంత ధనాన్ని
కట్నం క్రింద వసూలు చేసుకొనవలెననీ” ఆశిస్తుంటారు.
ఆడపిల్ల తరపువారు కూడా తక్కువేమీ కాదు.

‘పిల్లవాడి చదువుకోసం ఉన్నదంతా ఖర్చుచేసి అసలే
ఇబ్బందుల్లో ఉన్న మగపెండ్లివారిని తమ కుమార్తెకు షావుకార్ల
వలె ఎంతో విలువైన వెండి, బంగారం, ముత్యాలు తాపిన
నగలనూ, మంచి పట్టు-ముఖమల్ వస్త్రాలను ఇవ్వమని
అడిగి వరుడి తండ్రి యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా దెబ్బ
తీస్తున్నారు.

ఇరుపక్షాలవారు చదరంగపు ఆటలో వలె తమతమ
పావులను కదుపుతుంటారు. వీలయితే ఎక్కువ కట్నం రావాలి
మాకు – అని పిల్లవాడి తండ్రి కోరుకుంటాడు. “మా అమ్మాయికి
ఎవరు ఎక్కువ బంగారం పెడతారో ఆ సంబంధమే ఖాయం
చేద్దాం” అని భావిస్తారు వధువు తాలూకు కుటుంబం వారు.
ఈ పట్టుదల మధ్య రెండు కుటుంబాలవారికి ఎంతో ఎక్కువ
ఆర్థిక భారం పడుతుంది. దానితో ఒకటి, రెండు పెండ్లిండ్లు
చేసేటప్పటికి ఇల్లు గుల్లయిపోతుంది.

అనువాదం: శ్రీమతి కామరాజు కృష్ణకుమారి

Yug Shakti Gayatri Jan 2023

You may also like