Home Akhand Jyoti Magazine సమాజసేవ ద్వారా ఆత్మరక్ష

Loading

ఏ విధంగా సూక్ష్మాతి సూక్ష్మ అణువుల కలయిక ద్వారా ఈ విశ్వం ఉత్పన్నం అయినదో అదే విధంగా అనేక వ్యక్తుల కలయిక ద్వారా సమాజం తయారైనది. ఒక్కొక్కళ్లగా సమాజంలోని వ్యక్తులందరినీ వేరు చేస్తే ఇక్కడ సమాజము ఉండదు, ప్రపంచము ఉండదు. కనుక రండి, మనందరం మన అస్తిత్వం వేరు వేరు అనే ఆలోచన విడిచి వ్యక్తిత్వ స్వార్ధం లేక అహంకారం వదిలి వేసి, మన సద్గుణాల ద్వారా కలిసి సమాజం మరియు ప్రపంచానికి సేవ చేసి సుందర సృష్టి నిర్మిద్దాం. మనిషి సేవ చేయడానికే పుట్టాడు. నేను మీకు సేవ చేస్తాను, మీరు ఇంకొకరికి, వారు నాకు చేస్తారు. ఈ విధంగా మన పనులు అందంగా సువ్యవస్థితంగా సరైన సమయంలో జరుగుతూ ఉండాలి, మరియు రాగద్వేషాల రూపమైన నీవు నీవు, నేను -నేనే లాంటి ఆ పెనుగులాడే కళంకితమైన విధానాలను గ్రహించకుండా రక్షించుకుందాం, వాటిని ఆచరించుట వలన మనసు కలుషితమౌతుంది, బుద్ధి భ్రష్టు పడుతుంది, చిత్తం చంచలమవుతుంది మరియు పనికి రాని అహంకారము మెరుస్తుంది.

ఏ విధంగా ఆతిధ్యం-సత్కారం చేసేటపుడు లోపలి నుంచి సేవాభావం యొక్క సముద్రం ఉబుకుతుందో అదే విధంగా నిర్మలము, నిర్దోషం మరియు పరమార్థం యొక్క నిష్కలంక, పవిత్రభావన ఉంటుంది. సేవ అనేది చాలా ఉన్నతమైనది. సేవలో కూలి లేదా వ్యాపారం అనే భావన ఉండదు. ఇందువలన మనుష్యులకు సేవ చేయుట అన్నిటి కంటే ముఖ్య కర్తవ్యం. విదేశాలలో ఎలా ఉన్నా భారతదేశ సంస్కృతి మాత్రం మానవులకు సేవ చేయడం ద్వారానే మన రక్షణ జరుగుతుందని చెప్తుంది.

అఖండజ్యోతి 1949 మే 21వ పేజీ

You may also like