భావనాత్మకమయిన పరిపక్వతలే సుఖమైన జీవితము నకు ఆధారము. ఒక వ్యక్తి యొక్క భావనలు సంకుచితమయితే కుటుంబమునకు సామాజిక జీవితనమునకు మధ్య పరస్పర సంబంధాలు యుక్తమైన రీతిగా కొనసాగించలేము. జీవితం లోని ఆటుపోట్లు మధ్య భావనాలోకంలో విహరిస్తూనే ఉండును. మరియు వాస్తవికమయిన నిర్ణయాన్ని నిశ్చలంగా నిర్ణయించుకోలేకపోతాడు. దైనిక జీవన వ్యహారంతో మన ఆలోచనలను ఆచరణ బద్ధంగా క్రమశిక్షణలో నిర్వహిస్తున్న పుడు భావముల యందు సమతౌల్యతను సాధించగలము. భావన సమతుల్యతను ఎలా సాధించవలెనో సూచించే కొన్ని ఉపయోగకరమయిన సూత్రములు
1. మీ అంతర్గత భావములను అర్థం చేసుకొనండి, మీకు మీరే స్వీయమని తెలుసుకొనండి. మొదట అంశంలో మిమ్ములను మీరు అర్థం చేసుకోవడం. వివిధ విధాలుగా తమ స్వభావాలు వేరయిన వారితో వ్యవహరించేటపుడు మన మనసులోని భావములను ఏ స్థాయిలో, స్వరూపంలో ఏముండును? ఆ విధముగా అర్థం చేసుకొనుటకు ప్రయత్నిం చండి. ఎక్కడ మన ఆలోచనలు అస్థిరమైనవి. వాటి గురించి ఆలోచిస్తూ మనము వాటిని అవాస్తవికమని, అసహజమని,
మన ఆలోచనలే మనలను అణచి వేస్తున్నాయి, మొదలయిన వాటిని గురించి ఆలోచించవలయును. సుయోగ్యమయిన ఆలోచనలకు మనస్సుతో అవగాహన చేసుకొంటూ ముందు ముందు మన ఆచరణలను ఎటుల సుసంబంధం ఏర్పరచు కోగలము? మన ఆలోచనలను నియంత్రించుకొంటూ భవిష్యత్ జీవితమందున ఆచరించగలము. వీటిని పరిష్కరించుకో గలము, కానీ ఈ విధంగా జరుగవలెననుకోండి మన మనస్సును స్వీయ నియంత్రణలోనుంచుకొనుట అత్యంత ఆవశ్యకము.
2. మీ ఆలోచనలను సకారాత్మకంగా (పాజిటివ్) ప్రక టించగలిగి ఉండవలెను: మన ఆలోచనలను మనమే అర్థం చేసుకొనవలయుననిన, ఆ సకారాత్మక ఆలోచనల న్నింటినీ ఒక కాగితముపై వ్రాసుకొని మనస్సుని తేలికగా ఉంచు కొనవచ్చు. ఈ ఆలోచనలలోని స్పష్టతల గురించి ఆలోచించు కొనవచ్చును. లేదంటే మీకు మీ ఆలోచనలపై స్పష్టత కుదరని యెడల మీ మీ స్నేహితులతో గానీ, హితైఖిలా షులకు గానీ మాట్లాడుకొనవచ్చు. మన ఆలోచనలకు సకారాత్మక దృష్టి కోణంతో ఆలోచించి వారు సలహాలు ఇవ్వగలరు. అది కూడా వీలు కాకపోతే మిమ్ములను ఇష్టపడి ఆరాధించే వారిని కూడా సంప్రదించవచ్చు. విశ్వాస పాత్రమయిన నమ్మక మయిన ఆలోచనల సంప్రదింపులు సకారాత్మక ఆలోచనలకు ప్రేరేపించను. దీని వలన మానసిక స్థిరత్వము కూడా చేకూరుతుంది.
3. మొదలుపెట్టిన కార్యమేదయినా సమయానుకూలంగా సాధ్యమవుతుంది: ఆ ధైర్యమే సునిశ్చితమయిన విజయ సాధనకు తోడ్పడుతుంది. మనమెవరయినా హృదయపూర్వకం గా స్వీకరించినట్లయితే, తమ ఆలోచనలను నకారాత్మక దృష్టితో స్వీకరించడం మానివేయగలము. ఈ విషయంలో ఏ కారణమూ కనిపించదు. కానీ దీర్ఘకాలంగా పెంచిపోషించు చున్న, నకారాత్మక భావనలను, సకారాత్మకంగా మలచు కోవడానికి కొంత సమయం పట్టవచ్చు.
కానీ నమ్మకమైన ప్రయత్నము చివరకు ఫలించుటకై తోడ్పడును. జీవితంలో అస్థిరమైన, అసంతులితమైన నకారాత్మాక ఆలోచనల మూలాలను కూడా స్పర్శించినపుడు సహజంగానే మార్పులు జరుగుతూనే ఉండును. వీటితోపాటుగా వీపుపై నియంత్రించు కొనే శక్తి కలిగియుండుట ప్రారంభమవుతుంది. మరియు సకారాత్మక భావనలకు ప్రేరణ కలిగి భవిష్యత్ జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నా క్రొత్తగా ఆలోచించగల వివేకం పేర్కొనును.
4. సంవేదనలతో కూడిన ఆలోచనలు జీవితంలో భాగ స్వామ్యమై విలసిల్లును: భావనాత్మకమయిన అభివృద్ది చాలా తేలికైనది మరియు ప్రభావము కలిగించే సూత్రము. సానుభూతిగా మాట్లాడే మాటలను మనము చాలా శ్రద్ధగా విన్నచో, స్నేహ-సౌహార్ధతలు ఇతరుల పట్ల చూపించిననూ, వారి మనసుకు కలిగిన గాయాలు ఇట్టే మాయమైపోవును. నీ పట్ల, నీవు మాట్లాడిన మాటల పట్ల, ఎంతో విశ్వాసమును పెంపొందిస్తాయి. ఒక దార్శనిక తత్వవేత్త అయిన రచయిత స్టీఫెన్ ఏమన్నారంటే – “సానుభూతి పూర్వకమయిన మాటల వల్ల ఎమోషనల్ బ్యాంకు ఎకౌంట్ అభివృద్ధి చెందుతుంది. అనగా సంపూర్ణమయిన సకారాత్మక ఆలోచనలు నెలకొల్ప బడును. వ్యక్తి కూడా భావ ప్రవణుడిగా మారును. ప్రసన్న చిత్తుడై ఇతరుల విశ్వాసమును – ప్రేమనూ చూరగొంటాడు. తన యొక్క మంచి నడవడికతో అందరినీ ప్రభావితులను చేయగలడు. ఇవే ఆలోచనలను సకారాత్మాకంగా మార్చుకొన గలిగిన సాధనా పూర్వకమయిన ప్రయత్నములు విజయము సాధించును.
5. ఆత్మశిక్షణలో క్రమశిక్షణా సంయమ సదాచార వ్యవహారం: సంకుచితమయిన స్వార్థం, నీచమయిన అహం కారముపై స్వీయ నియంత్రణతో క్రమశిక్షణ పూర్వకంగా నియంత్రించుకొనిన యెడల సానుకూలముగా ఆలోచించుట సాధ్యపడును. లేని యెడల తన అహంకారమును తృప్తిపరచు కొనుటకై ప్రయత్నించిన యెడల తన మనసుపై నాతడు నియంత్రణ కోల్పోవును. నియమపూర్వకమయిన శారీరక – మానసికమైన స్వీయ నియంత్రణ సాధ్యమై వ్యక్తిత్వమును స్వశక్తియుతంగా మలచుకొనగలరు. సాధనా ప్రయత్నంలో మనస్సును శోధించుకొనగలడు. జన్మజన్మల నుండి పొందిన కుసంస్కారములను ప్రక్షాళన చేసుకోగలుగును. మరియు తన ఆలోచనలను సకారాత్మకంగా అభివృద్ధి చేసుకొనుటకు ఆధారము ఏర్పడును, నిష్కామ సేవతో అందరికీ తోడ్పాటు నివ్వగలరు.
6. నిష్కామ సేవ: మనము చేసే పనులన్నియు ఏదో ఒక ఒక స్వార్థంతో నిండి ఉంటాయి. ఆ కార్యములను తమ స్వార్థంతో సుసంపన్నం చేసుకొన్నామనే అహం మనసుకి ఒక విధమైన తృప్తిని ఇస్తుంది. వివేక-విచక్షణలతో ఆలోచించుకోలేని వ్యక్తి మూలాలలో నిక్షిప్తమైయున్న స్వార్థం మరియు అహంకారం పూర్తిగా నిండి ఉంటుంది, దీనివలన ఆ వ్యక్తి మనసు నిండా దుఃఖాన్నే పొందును. సాధారణంగా తన యొక్క బాధాపూరితమయిన మానసిక స్థితిని అర్థము చేసుకొనలేడు. కావున ఒక కార్యమును నిస్వార్థంగా నిర్వర్తిం చిన యెడల, వారి ఆలోచనలు కూడా అభివృద్ధికి బాటలు వేయును. ఆ బాటలో నెమ్మది నెమ్మదిగా అనుసరిస్తూ, సేవా భావం, అతని జీవితంలో ఒక భాగంగా అలవడుతూ ఉంటుంది, నిష్కామసేవకు తగ్గట్టుగా అభివృద్ధి కూడా గతి శీలంగా అడుగులు వేస్తుంది.
7. ఆధ్యాత్మిక భావనా ధ్యానము మరియు ఆరాధనా పూర్వక నియమపూర్వకమయిన ప్రార్థన: ఆలోచనలు, భావాలు, విశ్వాసము మొదలగు గుణములన్నియు హృదయ క్షేత్రంలో నింపుకోవలసిన ఆరాధనా భావము. ఉపాసన మనసుపై ఆ ప్రభావము చాలా ప్రభావయుక్తంగా ఉండును. మనసులోని భావాల లోతులకు ప్రవేశించి ఆ వ్యక్తిని భావనా శిఖరములకు చేర్చును, ఎందుకంటే విశాల హృదయ క్షేత్రము నుండి ఉద్భవించే భావనలతో తమ ఇష్ట ఆరాధ్యమైన వారితో సంబంధాలు ఏర్పడును. వారు ఎంతగానో తల్లీనమై, తన్మయమై పరమాత్ముని సన్నిధిని పొందినట్లు ఉంటుంది. పరమాత్ముని సన్నిధి చేరిన స్పర్శానుభూతి ఉన్నతమైన స్థాయికి వ్యక్తిని చేర్చును. భక్తుల యొక్క జీవితం రూపాంతరం చెంది చమత్కారంగా ఆశలన్నీ తీర్చుకోవడానికి మార్గాలు వేస్తాయి.
పైన చెప్పిన, వర్ణించిన సూత్రములను స్వీకరిస్తూ ఉన్నచో చమత్కారమయిన, సమన్వయ, సంతులిత జీవనమును గడుపుతూ జన్మను సార్థకం చేసుకుంటాము. ఆత్మవికాసము నకు ఉత్తమమయిన రాజమార్గము.
అనువాదం: శ్రీమతి నాగమణి
Yug shakti Gayatri July 2022