Home year1947 అతి విలువైన వర్తమానాన్ని సదుపయోగపరచండి

అతి విలువైన వర్తమానాన్ని సదుపయోగపరచండి

by Akhand Jyoti Magazine

Loading



మనం మృత్యువు, నిర్మాణాల నడుమ ఉన్నాము. వర్తమానం చాలా వేగంగా భూతకాలం వైపుకు పరుగెత్తుంది. భూతకాలం మరియు మృత్యువు రెండూ ఒకటే. చనిపోయిన తరువాత మనిషి గతం అవుతాడంటారు. మనిషే కాదు ప్రతి వస్తువు చనిపోతుంది మరియు గతంగా మారిపోతుంది. ఏదైనా ఒక వస్తువు యొక్క శక్తి ఎప్పుడు పూర్తిగా సమాప్తం అయిపోతుందో అపుడు దానిని సంపూర్ణ మృత్యువు అని చెప్పవచ్చును. కాని కొద్ది పరిమాణంలో మృత్యువు జన్మ తోటే ప్రారంభం అవుతుంది. బాలుడు జన్మించిన తరువాత పెరుగుతాడు అభివృద్ధి చెందుతాడు, అతని ఈ యాత్ర మృత్యువు వైపుకే ఉంటుంది.

ప్రపంచంలోని ప్రతి వస్తువు మరియు మనిషి శరీరం యొక్క నిర్మాణం ప్రతి క్షణం మార్పు చెందే తత్వాలతో జరిగింది. దాని చక్రం భూతకాలాన్ని వెనుకకు వదిలివేస్తూ భవిష్యత్తును పట్టుకుంటూ ప్రతిక్షణం చాలా వేగంగా ముందుకు పోతుంది. విశ్వం ఒక్క క్షణం కూడా స్థిరంగా ఉండదు. అణుపరమాణువుల నుండి విశాలమైన పరిమాణం కల గ్రహాల వరకు తమ యాత్ర అవిశ్రాంతమైన వేగముతో చేస్తున్నాయి. మన జీవితం కూడ ప్రతి ఘడియ కొద్ది కొద్దిగా మరణిస్తున్నది. ఈ దీపంలోని నూనె కొద్ది కొద్దిగా ఖర్చయిపోతున్నది. వర్తమానాన్ని జరిగిపోయిన కాలం ఒడిలో పడవేస్తూ మనం భవిష్యత్తు వైపుకు పోతున్నాము. ఇదంతా చూస్తూ కూడా మనం వర్తమానాన్ని సదుపయోగం చేయగలమా లేదా అని కూడా ఆలోచించము. గడచి పోయినదేదో గడచి పోయింది, వచ్చేది భవిష్యత్తు గర్భంలో ఉన్నది. వర్తమానం మన చేతిలో ఉన్నది. మనం కోరుకుంటే దానిని సదుపయోగం చేసి ఈ నాశనమగు జీవితములో నాశనము లేని లాభాన్ని పొందవచ్చును.

79

అఖండ జ్యోతి 1947 జూన్ 1వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ

You may also like