ఉపాసనకు అత్యంత అనివార్యమైనది – క్రమబద్ధత, నిరంతరత (ఆపకుండా) నిత్య ఉపాసన జరుగుతుంది. భగవంతుని స్మరణ జరుగుతుంది. అందులో నాగా ఉండకూడదు. పగలంతా కష్టించి పనిచేసిన గాంధీజీ పడక మీదకు వచ్చి కూర్చున్నాడు. అనారోగ్యాన్ని పారద్రోలడమే ఉద్దేశ్యం. గాఢ నిద్ర పట్టింది.
ఉదయం దాకా మెలకువ రాలేదు. ఆ రోజు నిద్రలేచిన తరువాత అలసట అనిపించింది. ఉదయం ఉపాసన అయితే జరిగింది. అయితే సాయంత్రం ప్రార్థన జీవితంలో ఎప్పుడూ వదలలేదు. ప్రార్థన చేయకుండా ఎప్పుడూ నిద్రపోలేదు. ఆరోజు ప్రాయశ్చిత్తంగా ఉపవాసం ఉన్నాడు. “బాపూ! ఇప్పుడైనా ఎంతో కొంత తినండి” అని అందరూ ప్రార్థించారు. ఆయన వినలేదు. “ఏ ప్రభువు కారణంగా ఒక్కొక్క క్షణం నేను జీవిస్తున్నానో, ఆ పరమాత్మనే మరచి పోయాను. దీనిని మించిన పాపం ఇంకేముంది. ప్రాయశ్చిత్తం చేసుకోకుండా ఎలా తినగలను” అన్నాడు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం ప్రార్థన చేసి నిద్రపోయాడు. ఆహారం తరువాతి రోజే తీసుకున్నాడు. ఇలాంటి భావం ఉండే సిద్ధులు సహజం గానే కురుస్తాయి.
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ