Home languageTelugu గృహస్థుగా ఉంటూనే ముక్తిని పొందండి

గృహస్థుగా ఉంటూనే ముక్తిని పొందండి

by Akhand Jyoti Magazine

Loading



దానశీలత, తపం, మరియు సద్భావనలను పాటిస్తూ మనం ముక్తికి సమీపంగా చేరకపోతే మనం ఈ కార్యాలను వాస్తవిక రూపంలో పాటించడటం లేదని అనుకొనవచ్చును.

భవిష్యత్తులో ముక్తి పొందటానికి బంధనాలపై ధ్యానముంచ వద్దు. నీవు ఈ జన్మలోనే ముక్తి పొందే ఉద్దేశాన్ని కలిగి ఉండు. దీని వలన ముక్తి పొంది జీవితమనే గుర్రం పై స్వారి చేసే ఆనందాన్ని పొందగలవు. కంచరగాడిద మీద మోపబడిన మూర్ఖుని వలె జీవితం మొత్తం గడపటము వలన లాభమేమున్నది? ముక్తి పొందిన స్త్రీ పురుషులు మాత్రమే ఆడుతూ పాడుతూ తమ దేశం మరియు సమస్త మానవ జాతికిని ముక్తిని లభింపచేయగలరు.

నీవు మోక్షం కొరకు ప్రణాళికాబద్ధంగా మరియు ఉత్సాహంతో ప్రయత్నం చేసినప్పటికీ ఈ జీవితంలో మోక్షం లభించని ఎడల అది కనీసం ముందరి కంటే ఎక్కువ దగ్గరకు మాత్రం చేరుకోగలవు. అప్పుడు నీ రానున్న తరం దానిని ఇంకా దగ్గరగా పొందగలరు. దీని ఫలితంగా వారి రానున్న తరం మోక్షం పైన స్వారి చేయగలదు. ఇందుకు అవసరమైన విషయమేమంటే నీవు రాబోయే నీ సంతానంలో ముక్తి కొరకు వ్యాకులతా భావం పుట్టించగలగాలి. నీవు ఈ విధంగా చేయగలిగితే నీవు ముక్తిని పొందినట్లు మరియు ఎవరూ నిన్ను మోక్షం పొందకుండా చేయలేరని తెలుసుకో.

ఎందువలననగా ముక్తి మరియు బంధనాలు మనసుపై ఆధారపడి ఉన్నాయి, అందువలన రాగద్వేషాలు, ఆసక్తిరహితుడిగా, ఫలాన్ని ఆశించకుండా; గృహస్థు కార్యాలను నిష్ఠతో పాటిస్తూ కర్మ బంధనాల నుండి విడిపోగలవు.

230

అఖండజ్యోతి 1959 జూలై 10వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ

You may also like