ఏ మనిషి కేవలం ఇంద్రియ సుఖాలు, శారీరిక కోరికలుతీర్చుకోవడానికి జీవిస్తాడో, ఎవరి జీవితోద్దేశ్యము “తిను, తాగు, ఆనందించు” అవుతుందో నిస్సందేహంగా ఆ మనిషి భగవంతుని ఈ సుందరమైన పృధ్వీ మీద ఒక కళంకము, భారము, ఎందువలననగా అతనిలో భగవంతుని గుణాలు అన్ని ఉన్నప్పటికీ అతను ఒక పశువు మాదిరిగా నీచమైన ప్రవృత్తులలో చిక్కుకొని ఉన్నాడు. ఏ మనిషిలో భగవంతుని అంశ ఉన్నదో అతడు తన నోటితో తన భ్రష్టజీవితం యొక్క దుఃఖగాధను వినిపిస్తాడు.
వాస్తవంలో ఆదర్శమైన మనిషి ఎవరంటే అన్ని పాశవిక ప్రవృత్తులు మరియు విషయ వాసనలను దూరంగా ఉంచుతూ కూడా వాటిపైన తన సంయమనం మరియు శాసించే మనసుతో వాటిని ఏలుతాడు, తన శరీరం పై తనే యజమాని అయి, తనలోని సమస్త విషయవాసనల కళ్లెమును తన ధృఢమైన మరియు ఓర్పు కల చేతులతో పట్టుకొని ప్రతి ఇంద్రియానికి నీవు నాకు సేవ చేయాలి కాని నాపై అజమాయిషీ కాదు అని చెప్తాడు. నేను మిమ్ములను సదుపయోగపరుస్తాను కాని దరుపయోగపరచను. ఇటువంటి మనుష్యులే తమ సమస్త పాశవిక ప్రవృత్తులను మరియు కోరికల శక్తులను దైవత్వం లోనికి పరిణమింప జేయగలరు. కాముకత్వం మృత్యువు, మరియు సంయమనం జీవితం. నిజమైన రసాయనిక శాస్త్రజ్ఞుడెవరంటే విషయ వాసనలనే లోహాన్ని ఆధ్యాత్మిక మరియు మానసిక శక్తులనే సువర్ణంగా మార్చివేస్తాడు. అతనికి ప్రతి వస్తువు మరియు పరిస్థితిలో ఆనందం దృశ్యమాన మవుతుంది.
61
ఖండ జ్యోతి 1945 డిసెంబర్ 1వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ