మనము మన శక్తులను ఉపయోగంలోకి తెచ్చినపుడే మనము భగవంతుని ప్రార్థించిన దానికి జవాబు లభిస్తుంది. నిర్లక్ష్యము, బద్ధకము, పనికిమాలిన తనము, అజ్ఞానము అనే అన్ని అవగుణాలు కలిస్తే మనిషి స్థితి ఆమ్లము పోసిన కాగితపు సంచి స్థితిలా అవుతుంది. అటువంటి సంచి ఎక్కువ కాలం నిలిచి ఉండక పోగా చాలా తొందరగా చిరిగి నశించి పోతుంది. భగవంతుని నియమాలు తెలివైన తోటమాలి వంటివి. అతను పనికిరాని గడ్డి మొక్కలను పీకి పారవేసి యోగ్యమైన మొక్కలను సంరక్షించి వాటిని ఉన్నతంగా ఎదిగేలా చూస్తాడు. ఎవరి పొలంలో పనికి రాని కలుపుమొక్కలు పెరుగుతాయో అందులోని వరిపంట చనిపోతుంది. తన పొలాన్ని చెడగొట్టుకునే రైతును ఎవరు ప్రశంసిస్తారు. భగవంతుని నియమాలు ఖచ్చితంగా సృష్టి సౌందర్యం నశించిపోకుండా పనికిరాని పదార్థాల మురికిని తొలగించడమే.
ప్రార్థనకు నిజమైన జవాబు పొందటానికి అన్నిటికంటే ముఖ్య మార్గము ఆత్మ విశ్వాసము. కర్తవ్యపరాయణ ద్వారానే నిజమైన ప్రార్థన సాధ్యమౌతుంది. భగవంతుడనే సర్వవ్యాపితమైన శక్తిలోనికి ప్రవేశించు మార్గము ఆత్మలో గుండానే. అదే ఈ కందకానికి వంతెన. అవిశ్వాసులు, విశ్వాస ఘాతకులు ఖచ్చితంగా ఆపదలలో పడి ఉంటారు, సరైన మార్గం కొరకు వెతుకుతూ తిరుగుతూ ఉంటారు. ఆత్మను తిరస్కరించే వారికి భగవంతుని వద్ద కూడ తిరస్కారమే లభిస్తుంది మరియు వారి ప్రార్థన కూడ నిష్ఫలమౌతుంది.
35
అఖండజ్యోతి 1943 మార్చి 18వ పేజీ https://chat.whatsapp.com/LYfpk5836TQERzAv5kcUxs