మన వలన ఎల్లపుడు తప్పులు జరుగుతూ ఉంటాయని అనుకుందాము. ఇవి మన శరీరం మరియు మనసు వలన జరిగే పొరపాట్లు. నిత్యం దండన పొంది ఆ నష్టాని పూడ్చుతూ కూడా ఉంటాము. ఆత్మ అనే మన మూల శక్తి ఈ పోరపాట్ల కంటే ఉన్నతమైనది. అది ఎపుడూ పొరపాటు లేక పాపంలో ప్రవృత్తం కాదు. ప్రతి చెడ్డపని జరిగేటపుడు వ్యతిరేకించడం, మంచి పని జరిగేటపుడు సంతోషించడం దాని నిశ్చితమైన కార్యక్రమం. తన ఈ సనాతన స్వభావాన్ని ఎపుడూ విడిచి పెట్టదు. దాని పిలుపును మనం ఎంత నిర్లక్ష్యం చేసినా ఎంత అణిచి వేసినా, ఎంత వినకపోయినా అది దిక్సూచిలోని ముల్లు వలె తన దృష్టిని పవిత్రత వైపుకే ఉంచుతుంది. దాని స్ఫురణ ఎప్పుడూ సాత్వికంగానే ఉంటుంది. ఇందువలన ఆత్మ ఎపుడూ అపవిత్రం లేక పాపి కాజాలదు. ఎందువలనంటే మనం శరీరం మరియు మనసు కాదు ఆత్మే. ఇందువలన మనలను మనం ఎల్లప్పుడూ ఉచ్ఛమైన, ఉన్నతమైన, పవిత్రమైన, నిష్పాపియైన పరమాత్ముని పుత్రులమని భావించాలి. మనం మన ఎడల పవిత్రతా భావాన్ని కలిగి యుండుట ద్వారా మన శరీరం మరియు మనసు కూడా పవిత్రత మరియు ఔన్నత్యం వైపు వేగంగా ముందుకెళ్తాయి.
మనం స్వయంగా కర్తలం మరియు భోక్తలం. కర్మ చేయుటలో మనకు పూర్తి స్వతంత్రత ఉన్నది. మనం చేసే పనికి భగవంతుని విధానానికి అనుగుణంగా తగిన ఫలితం వెంటనే గాని లేక ఆలస్యంగా కాని లభిస్తుంది. ఈ విధంగా మన భాగ్యనిర్మాతలం స్వయంగా మనమే. పరిస్థితులకు జన్మనిచ్చేది మనమే.
74
అఖండజ్యోతి 1947 జనవరి 8వ పేజీ