భోజనంతో మన ఆరోగ్యానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. దీని గురించి అన్ని కోణాల్లో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అవి తినేవారికి వారు యువకులైనా లేదా అరుగుదల మందగించిన వయసు మళ్ళిన వారైనా కుండా వారి ఆరోగ్యం తప్పక పాడవుతుంది. రకరకాలయిన రోగాలు చుట్టుముడతాయి. అందువల్ల శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఆమ్ల కారక పదార్థాలను తగ్గించి క్షారగుణాలు కలిగిన పదార్థాల మోతాదును భోజనంలో పెంచాలి. శరీరానికి సరిపడని మరియు అసంతులిత భారీ విందు భోజనం చేసేవారికి తరచుగా మలబద్ధకం ఏర్పడుతుంది. అందువల్ల భోజనంలో తేలికగా అరిగే పదార్థాలు, అలాగే లోపల ప్రేగుల్లోని మలాన్ని న్నారు. బయటకు పంపించడానికి ఉపయోగపడే పీచు ఎక్కువగా ఉండే పదార్థాలను నియమిత రూపంలో తీసుకొని, ఎక్కువ నూనెలో అతిగా వేయించిన వేపుడు పదార్థాలను తినకుండా ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి.
సమయానికి తినడం, తిన్న ఆహారాన్ని ఏ కష్టం లేకుండా (చనం) అరిగించుకోవడం, ఆ సమయంలో అలాగే పనికి రాని వ్యర్థాలను మలం రూపంలో బయటకు పోవడం చాలా అవసరం. మలం బయటకు పోకుండా శరీరంలో ఉండిపోతే ఆ మలమే సమస్త రోగాలకు మూలకారణమౌతుంది. అందువల్ల ఎప్పుడూ మనపొట్టలో నిరంతరంగా వ్యర్థాలు నిలువ ఉండకుండా బయటకు వెళ్ళి పోవడం అవసరం. ప్రేగుల్లో
మలం నిలబడిపోకుండా చూసుకోవాలి. దీనికోసం ఏ ఏ పదార్థాలు తేలికగా అరుగుతాయో, ఏఏ పదార్థాలను తింటే మలబద్దకం ఏర్పడుతుందో మనం తెలుసు కోవడం చాలా అవసరం. లేదంటే తేలికగా అరిగేవి మరియు సాధారణ భోజనం చేసినా కూడా మన అరుగుదల సరిగా లేకపోతే, ఎక్కువ నూనెలో బాగా వేయించిన పదార్థాలను, భారీ విందు భోజనం తిన్నట్లుగా తయారవుతుంది. అది ప్రేగుల్లో అతుక్కు పోతుంది. దాన్ని వదిలించుకోవడానికి శరీరానికి అవసరమైన దాని కన్నా ఎక్కువ శక్తిని వినియోగించి కష్టపడవలసి వస్తుంది. సాధారణంగా ఎంత తినాలో తెలియక ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉండటం వల్ల ప్రజలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటు
పొట్ట మొత్తం శుభ్రపడటానికి, పొట్ట ఆరోగ్యానికి అన్ని రకాలైన పళ్ళు తినాలి. ఆపిల్, కమలా, పైనాపిల్, బొప్పాయి, జామ, ద్రాక్ష లాంటి పళ్ళు రేచక గుణాలతో పూర్తిగా నిండి ఉంటాయి. పళ్ళలో ఉన్న పీచు పదార్థం కారణంగా ఈ పళ్ళను తినడం వల్ల పొట్ట బాగా శుభ్రపడుతుంది. కానీ కొన్ని పండ్లను పచ్చిగా ఉన్నప్పుడు తినడం వల్ల అంత లాభం ఉండదు. అలాగే కొన్ని పళ్ళను కోల్పోతాము. కానీ సంపు ర్ణంగా మలాన్ని బయటకు పంపించ డానికి ప్రేగులను బాగా శుభ్రం చేయడానికి పళ్ళు అధికంగా తినడం అత్యంత లాభదాయకం అనేది వాస్తవం. అందువలన రోగులకు మరియు ముసలి వారికి పళ్ళు తినమని డాక్టర్లు చెప్తూ ఉంటారు. రోగులకు అరుగుదల తక్కువగా ఉండటం వల్ల భారీ పదార్థాలను అరిగించుకొనే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. అందువల్ల పచ్చివి లేదా ఉడికించిన కాయగూరలు, ఉడికించిన సూప్ల రూపంలో సలహా ఇస్తారు.
కొన్ని పళ్ళు కూరగాయలే కాకుండా దుంపలు వాటిలో పీచుపదార్థం లేకపోవడం వల్ల చాలా కష్టంగా అరుగుతాయి. గుమ్మడికాయ, చామదుంపలు, చిలగడదుంప, కంద, పనస లాంటివి. సరైన పీచుపదార్థాలు లేకపోవడం వల్ల వీటిని నూనె లేదా నేతిలో అతిగా వేయించడం వల్ల ఇవి ఇంకా భారీగా తయారవుతాయి, అరగవు. ఒకవేళ వీటిని తినాలని అనిపించినప్పుడు ఉడకబెట్టి, తక్కువ నూనె లేదా నెయ్యిలో తక్కువ మసాలాను ఉపయోగించి వండుకొని తినాలి. ఎల్లప్పుడూ బాగా పండిన అరటి పళ్ళను మాత్రమే తినాలని డాక్టర్లు చెప్తారు. పచ్చి అరటి కాయలను పండుగా తినకుండా కూర వండుకొని మాత్రమే తినాలి. అరటిపండ్లు తినాలను కుంటే ఒకటికి బదులుగా రెండు లేదా మూడు పండ్లను పెద్దవారు తినడం లాభదాయకం. జీడిపప్పు, బాదంపప్పు, అక్రోటు, పిస్తాపప్పు, వేరుశనగపప్పు మొదలైన వాటిలో పీచుపదార్థాలు లేకపోవడం వల్ల అరగడం చాలా కష్టము. కానీ నీటిలో ఉన్న నూనె లేదా జిడ్డు పదార్థం ప్రేగుల్లో అంటుకుపోకుండా ఆపుతుంది. వేరుశనగపప్పులను నానబెట్టి వాటికి మొలకలు వచ్చిన తరువాత తినడం వల్ల అధిక రేచకంగా పచనమయ్యేవిగా తయారవుతాయి. ఇలా తినడం వల్ల పౌష్టిక విలువలు కూడా పెరుగుతాయి.
పొట్టను శుభ్రపరచుకోవడానికి తాజాగా ఉన్న ఆకు కూరలు, కాయగూరలు చాలా ఎక్కువగా ఉపయోగపడ తాయి. కానీ ఈ తొక్క తీసి వాడినప్పుడు ఆ కూరగాయలలో ఉన్న మంచి గుణాలు మరియు పోషకాలు అంతరించి పోతాయి. తొక్కు తీసి వాడటమే కాక వాటిని నూనెలో బాగా వేయించడం వల్ల పూర్తిగా వాటిలోని పోషకాలు నశించి తర్వాత అవి తింటే అరగడం కష్టమయ్యే విధంగా తయారవు తాయి. కూరలను అతిగా వేయించడం వల్ల నోటికి రుచిగా
అనిపించవచ్చేమో కానీ ఆరోగ్యానికి ఏ విధంగానూ ఉపయోగ పడవు. ఎందుకంటే దానిలో ఉన్న పోషకాలు ఆ అతిగా వేయించే ప్రక్రియలో పూర్తిగా నశిస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు తిని ఆరోగ్యం బాగుపడి తద్వారా మనం లాభ పడాలనుకొంటే తోలుతోపాటుగా తక్కువ మంటపై వండాలి. అలాగే కూరగాయలను, ఆకుకూరలను తరిగిన తరువాత కడగకుండా ముందుగా కడిగి ఆ తరువాత ముక్కలుగా కోసుకొని మనం కూర వండితే నిస్సందేహంగా మన ఆరోగ్యాన్ని వృద్ధి చేసేవిగా ఉంటాయి. తద్వారా మన అరుగుదల కూడా బాగా జరుగుతుంది. ఇలా తినడం వల్ల అనేక రోగాల బారిన పడకుండా రక్షించుకొనే మార్గం సుగమం అవుతుంది.
సేకరణ: అఖండజ్యోతి, సెప్టెంబరు 1989 అనువాదం: కంది స్వప్న, నెల్లూరు యుగ శక్తీ గాయత్రి జూన్ 2023
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ