నిప్పును ఎక్కడ ఉంచితే ఆ ప్రదేశాన్ని మొదట వేడిచేసి తర్వాత మండిస్తుంది. ఘాటైన ద్రావణాన్ని మామూలు లోహ పాత్రలో ఉంచితే అది మొదట ఆ పాత్రనే తినివేస్తుంది. ఇదే విధంగా ద్వేషం, దుర్భావన, పాపం, చెడు ఆలోచనలు ఎవరి మనసులో ఉంటాయో అవి అతడినే మొదట నాశనం చేస్తాయి. అవి స్థిరంగా ఉన్నంత వరకూ అతనికి హాని కలిగిస్తూనే ఉంటాయి. అందువలన దాని నివారణకై ఉచితమగు మార్గాన్ని శ్రద్ధగా వెదకాలి. మనసులో దాన్ని ముడివేసుకొని ఈర్ష్యా, ద్వేషాలను పెంచుకోవడం ఏ మాత్రం తగదు. మహాత్మాగాంధీ ఈ సిద్ధాంతాన్ని విజయవంతంగా ప్రయోగించి చూపారు. విరోధి పట్ల చెడు భావం లేకుండా చెడును తొలగించడం సాధ్యమని చూపారు. మనం కూడా అదే మార్గాన్నే అవలంభించాలి. ఇతరుల దుఃఖాన్ని మన దుఃఖంగా, వారి ఆపదను మన ఆపదగా పరిగణించాలి. అపుడే ప్రపంచంలో శాంతి సామ్రాజాన్ని స్థాపించగలము. మనం ద్వేష భావాన్ని వదిలివేసి, అందరిపట్ల ప్రేమభావాన్ని కలిగి ఉండాలి, స్వార్థ భావాన్ని వదిలివేసి పరమార్థ భావాన్ని ఆశ్రయించాలి. అపుడే అందరికీ శుభం జరుగుతుంది.
అఖండజ్యోతి, జూన్, 1953,
యుగశక్తి గాయత్రి – Oct 2010