Home Health జిహ్వ

జిహ్వ

by

Loading

ఒక తపస్వి వనంలో ఘోర తపస్సు ఆచరించసాగాడు. అది చూచి ఇంద్రుడు కంగారుపడి తన ఇంద్రాసనం ఎకుడ కోల్పోవలని వస్తుందోనన్న భయంతో అతనికి తపోభంగం కలుగజేయాలని నిశ్చయించుకొంటాడు. అప్సరసలు పంపిన రాక్షసులను పంపినా ఎంతకీ తపస్వి చలించలేదు. చివరకు ఇంద్రుడు బాలభక్తుని రూపాన్ని ధరించి, కమ్మని పిండివంటలను నైవేద్యంగా తీసుకొని తపస్వి వద్ధకు రాసాగాడు. ముందు ఉ పేక్షాభావంతో తిరస్కరించిన, రోజురోజుకి ఆ భక్తుడు తెచ్చే పిండివంటల సువాసనలకు వషూడైన తపస్వి జివ్వాను గ్రహించుకోలేకపోయాడు. ఈవిధంగా పిండి వంటల ఆరగింవు కొనసాగుతుండగా ఒకనాడు ఒక స్త్రీ 33 రకాల పిండివంటలతో విందు ఏర్పాటు చేని తపస్వికి ఆహ్వానాన్ని పంపింది. షడ్రసోపేతమైన ఆ విందుకు ప్రసన్నుడైన తసస్వి, శాశ్వతంగా ఇటువంటి పదార్థాలను తినవచ్చని భావించి ఆ భక్తురాలి కోరిక మేరకు ఆమె ఇంటనే ఉండిపోయాడు, ఒకనాడతడు ఆ స్త్రీని గాంధర్వవిధిని వివాహాం చేసుకొంటాడు. ఇంద్రుడు తన వథకం పారినందుకు సంతోషించి, ఆనందంగా వెనకకు మరలిపోతాదు. ఇతర రసాలన్నీ వదులుకోవచ్చును గానీ, పెద్ద పెద్ద తపస్వి సహితం *జిహ్వను* నిగ్రహించుకోలేరు. *జిహ్వకు* వశులై సాధనా భ్రష్టులై పై తపన్విలా క్రమంగా దిగజారిపోతారు.

– (ప్రజ్ఞ పురాణం నుండి)

*రచయిత : పండిత్ శ్రీ రామ్ శర్మ ఆచార్య*

అనువాదం: శ్రీమతి గౌరీ సావిత్రి

*యుగ శక్తి గాయత్రి పత్రిక జూన్ 2018*

You may also like