ఒకసారి ఒక సాధువు గాంధీ గారి వద్దకు వచ్చాడు. “బాపుజీ! మేమింత వరకు భగవంతుని చూడలేదు. చూడని వానిని ఎలా పూజించగలము? అని ప్రశ్నించాడు” నీవు భగవంతుని చూడలేక పోవచ్చు కానీ అతడు చేసిన సృష్టిని చూస్తున్నావు కదా! దానిని సేవించు. అదియే భగవంతుని సేవ అవుతుంది” అన్నారు గాంధీగారు.
ఈ సమాధానం సాధువుకు తృప్తి కలిగించలేదు. ఈశ్వరుని సృష్టి అనంతమైనది. దీనిని సేవించాలంటే ఏ వైపు నుండి మొదలు పెట్టాలి? మరో ప్రశ్న వేశాడు సాధువు. ఈశ్వరుని సృష్టి నీకు బాగాతెలిసింది. అతి సమీపంలో ఉన్నది నీ పొరుగు వాడే అని గ్రహించు. ప్రొద్దున్నే నీవాకిలిని శుభ్రం చేసుకునేటప్పుడు నీ ప్రక్కవాని వాకిలి గురించి శ్రద్ధవహించు. నీ వాకిట్లోని దుమ్మును వారివాకిట్లోకి చేర్చకూడదు,ప్రస్తుతానికి అదే పెద్దసేవ. అంటూ గంభీరంగా జవాబు చెప్పాడు గాంధీజీ. ఆ సమాధానం విని అప్రతిభుడైపోయాడు సాధువు. యుగశక్తి గాయత్రి – ఏప్రిల్ 2016*ప్రజ్ఞాపురాణం*