Home కొలిమితిత్తి ఉపదేశం

కొలిమితిత్తి ఉపదేశం

by

Loading

కుమ్మరి కొలిమికి, గాలిని కొట్టే కొలిమితిత్తికి మధ్య ఒకసారి పోట్లాటవచ్చింది. కొలిమి మండిపండుతూ “చనిపోయిన జంతువుల అసహ్యకరమైన చర్మంతో తయారయి, కురూపిగా ఉండి, చెడువాసన వేసే నీ వల్ల నాకు చాలా బాధకలుగు తుంది. నా దారి నుండి తొలగిపో” అని తిట్టసాగింది. కాని కొలిమితిత్తికి కోపం రాలేదు. శాంత స్వరంతో “నీ ముఖంలోని ఎర్రతనం నా నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాల పరిణామం, నేను నా పని మానేస్తే నీవు బూడిదగా మారిపోతావు” అని అన్నది. సామాజిక జీవనంలోని నీతి కూడా ఇదే. చాలమంది తామేదో గొప్పవారమని, తమవల్లే సంస్థలు, సమూహాలు నడుస్తున్నాయని అహంకారంతో, గర్వంతో ఉంటారు. కాని ప్రజలు స్నేహం కోల్పోతే వారు ఎందుకు పనికి రాకుండా పోతారు. తమ ప్రగతికి, తన గొప్పదనానికి కారణభూతమైన వ్యక్తు లకు, సమాజానికి తలవంచి నమ్రతతో నమస్కరించినంత వరకే ప్రగతిపథంలో పయనం సునాయాసంగా జరుగుతుంది.

– ప్రజ్ఞా పురాణం నుండి

యుగశక్తి గాయత్రి – Oct 2010