Home నేతాజీ సమయస్ఫూర్తి

నేతాజీ సమయస్ఫూర్తి

by

Loading

సాహసం అనేది ఉంటే ప్రతికూల పరిస్థితులలో కూడా సంతులనాన్ని కోల్పకుండా పనులు సాధించుకోవచ్చు.

సుభాష్ చంద్రబోసు మొదటి తరగతి పెట్టెలో ప్రయాణం చేస్తూ ఉండగా ఆ బండిలోకి ఒక విదేశీ మహిళ ఎక్కి “నీ దగ్గర ఉన్న విలువైనవన్నీ నోరు మూసుకు ఇచ్చేయి లేదా గోల చేసి అల్లరిబెడతాను, అందరి ముందు నిన్ను అప్రతిష్ఠ పాలు చేస్తాను” అని బెదిరించింది. క్షణాలలో గొప్ప నిర్ణయాలు తీసుకోగల మేధస్సు, సమయస్ఫూర్తి కల్గిన బోసుకు ఆమె ఎత్తుగడ అర్ధమయింది. చెవిటివాని వలె అద్భుతంగా నటించసాగాడు. తనకేమి అర్థం కాలేదని, చెప్పేదేమిటో కాగితం మీద వ్రాసి ఇమ్మని వినయంగా కోరేడు. ఆమె నేతాజీ సైగలను నమ్మి ఏమాత్రం సందేహించకుండా ఆ విషయం కాగితం మీద వ్రాసి ఇచ్చింది. అంతే బోసు పకపక నవ్వసాగాడు. సాక్ష్యాధారలతో సహా ఆమె మోసం అతని గుప్పెటలో ఉండటం వల్ల ఆమె అరవాలన్న అరవలేపోయింది. ఈ మహాపురుషుడు తన చాకచక్యం, మేధాశక్తి ద్వారా ఎంత దారుణమైన మోసాన్నైనా ఇలాగే క్షణంలో చిత్తుచేసి పడేసేవాడు.

– ప్రజ్ఞాపురాణం నుండి

యుగశక్తి గాయత్రి – Sept 2010