నిజాయితి లేనివాడు స్థిరంగా ఉండే లాభాలను పొందడమనేది సందేహమే. నిజాయితీ లేనివాడు కూడా నిజాయితీ అనే ముసుగు కప్పుకునే లాభం కూడా పొందవచ్చు. పాలలో నీళ్ళు కలిపి అమ్మేవారు, నెయ్యిని కత్తి చేసి అమ్మేవారు వారిపై విశ్వాసం ఉన్నంతవరకే ఆ పనిచేయగలరు
. ఇది ప్రామాణికత, విశ్వాసముల ఫలితం. విశ్వాసం పోగొట్టుకుంటే వారి పని ఇక ముందుకు సాగదు.
ఎవరు వారిని నమ్మరు. హెచ్.ఎమ్.టి., ఫేవర్‌లూబా, సీకో కంపెనీల గడియా రాలు, గ్రు కంపెనీ కార్లు, బాటా కంపెనీ చెప్పులు మొదలైనవి ఖరీదు అయినప్పటికీ ప్రజలు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే ప్రజలకు వాటిపై విశ్వాసమే కారణము. ఇక నకిలీ వస్తువులు తయారు చేసే కంపెనీలు ఎక్కువ కాలం నిలువవు. కొందరిని కొన్ని రోజులు మోసం చేయవచ్చు. తరువాత పట్టుబడక తప్పదు, దెబ్బలు తినక తప్పదు. అందరినీ అన్నివేళలా మోసం చేయడం అసాధ్యం .
– పండిత శ్రీరామశర్మ ఆచార్య
యుగశక్తి గాయత్రి – Jan 2022