స్త్రీలకు గాయత్రీ సాధనాధికారము
కొంతమంది వ్యక్తుల దృష్టిలో స్త్రీలు గాయత్రీ ఉపాసన చేయకూడదు. శాస్త్రాలలో వారికి గాయత్రీ ఉపాసనపై ప్రతిబంధకాలున్నాయి. అక్కడక్కడ ఐదు, పది శ్లోకాలు స్త్రీలను వేదపఠనానికి, గాయత్రీ ఉపాసనని నిరోధించే
శ్లోకాలు కూడ వున్నాయి. పండిత సమాజం వాటిని ఆధారం చేసుకొని స్త్రీలు గాయత్రీ జపము, వేద శాస్త్రాలు అధ్యయనం చేయరాదని చెబుతూ ఉంటారు. కాని శాస్త్రీయ ఆవిష్కరణలలో లోతుగా వెళ్ళే కొలది ఈ ప్రతిబంధక శ్లోకాలు మధ్యకాలీన సామంత వాద నమ్మకానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఆ సమయంలోనే ఇలాంటి శ్లోకాలు తయారు చేసి ఇరికించడం జరిగింధీ సత్య సనాతన వేధోక్త భారతీయ ధర్మమ్ వాస్తవిక ఆలోచనా ధారలలో స్త్రీల పట్ల ఎటువంటి ప్రతిబంధకాలు లేవు. వాటిలో పురుషుల లాగే స్త్రీలు కూడా ఈశ్వర ఉపాసన మరియు ఆశ్రయంతో ఆత్మ ప్రయోజనాన్ని పొందగలిగే సౌకర్యం ఉన్నది.
పురుషుల తరహాలోనే స్త్రీలు కూడ గాయత్రీ ఉపాసనతో ప్రయోజనాలు పొందవచ్చు. స్వాభావికంగా తల్లి కొడుకుల కంటే కూతుళ్ళ పట్ల అధిక ప్రేమను చూపుతుంది. కుమార్తెల పట్ల ఎక్కువ ఉదారంగా వుంటారు. ఈ కారణంగా గాయత్రి ఉపాసనవలన పురుషుల కంటే స్త్రీలకే ఎక్కువ ప్రయోజనాలు లభిస్తాయని కొంతమంది ఆధ్యాత్మిక తత్వవేత్తలు చెబుతుంటారు.
ప్రాచీన కాలంలో అగ్రస్థానంలో వున్న స్త్రీ సాధకులు అనేకమంది వున్నారు. ఆధ్యాత్మిక కార్యాలలో వారు పురుషులకు ఏ మాత్రం తీసిపోలేదు. నారీ తపశ్శక్తే ఆమె గర్భం నుండి మహిమ గల ఆత్మలను ప్రసవించే సమర్ధత కలిగి ఉంటుంది. తపస్విని అయిన అదితి వామన భగవానునికి జన్మనిచ్చింది. కౌశల్య ఒడిలో రాముడు ఆటలాడాడు. – దేవకి కృష్ణునికి జన్మనిచ్చింది. రోహిణి, యశోదల ఒడిలో బాల్య క్రీడలు ఆడవలసి వచ్చింది. దేవతలందరి జనని అదితి మాత. భగవతీ కాత్యాయని అసురులపై విజయం సాధించడంలో సమర్ధత కలది. మాతా శత – రూప గర్భం నుండి మానవ ప్రాణి ఉద్భవించింది. బ్రహ్మవాదిని ఘోషా కాక్షీవాన ఋషి పుత్రిక. ఆమెకు కుష్ఠురోగం వచ్చింది. తపస్సు ద్వారా అశ్వినీ కుమారుని ప్రసన్నం చేసుకుంది.కదర్మ మహర్షి ధర్మపత్ని దేవహుతి
తపస్వి జీవనాన్ని జీవించి కపిల భగవానునికి జన్మనిచ్చింది. మేధా తిధి మహర్షి పుత్రిక అరుంధతి. తాపసారణ్యవనంలో తపస్సు చేసి వశిష్ఠుడు లాంటి యోగిని భర్తగా పొందింది. వారు సశరీరంతో అజరామరులుగా ఉండేవారు. – అత్రి మహర్షి వంశంలో జన్మించిన బ్రహ్మవాదిని, గొప్ప పండితురాలు అయిన విశ్వవార ఋగ్వేదంలో అయిదవ మండలం ద్వితీయ అధ్యాయంలోని 28 వ సూక్తి కి చెందిన ఆరు మంత్రాల ద్రష్ట. ఆమె తన తపోబలంతో ఋషిపదవిని పొందింది. తపస్విని అపాల అసాధ్యమైన రోగాల బారిన పడింది. తపస్సు చేసి ఇంద్రుడిని ప్రసన్నం చేసుకుని ఆరోగ్యాన్ని మరియు బ్రహ్మజ్ఞానాన్ని పొందింది. ఈమె కూడ ఋగ్వేదం 8వ అధ్యాయం, 91 వ సూక్తి యొక్క మొదటి ఏడు మంత్రాల ద్రష్ట. సతి తపతి వయసు బాగా పెరిగింది. ఆమెకు వివాహం జరగలేదు. తపతి తపస్సుకు ప్రసన్నుడై సాక్షాత్తు నారాయణుడే ఆమెను వివాహమాడాడు. అభృణ ఋషి పుత్రిక వాక్రసిద్ధ బ్రహ్మవాదిని అయింది. ఋగ్వేద సంహిత దశమ అధ్యాయం 925వ దేవీ సూక్తం 8వ మంత్రానికి ఋషి ఈ వాగ్గేవియే. ఋగ్వేదం. దశమ అధ్యాయం 75వ సూక్తం మంత్రాలకు ఋషి అయ్యే శ్రేయస్సు బ్రహ్మవాదిని
IS ఎదుగు వారు సూర్యాకు లభించింది. పెద్ద రోమాలు గల భావభవ్య ఋషి ధర్మపత్ని రోమేశా ఋగ్వేదం ప్రధమ అధ్యాయం 126వ సూక్తంలోని 7 మంత్రాలకు ద్రష్ట, ఋషి అయింది. బృహదారణ్యక ఉపనిషత్తులో వచక్తు ఋషి పుత్రిక గార్గి మరియు యాజ్ఞవల్క్యుని శాస్రార విస్తృత వర్ణన వున్నది.
మహా తపస్వినీ గార్గి జనక మహారాజు సభలో యాజ్ఞవల్క్యుని పోటీలో ఓడించింది. బ్రహ్మవాదిని ‘సులభ’ జనకమహారాజు లాంటి తత్వజ్ఞాని . యొక్క అనేక భ్రాంతులను నివారించింది. ఆసంగ రాజు. పత్ని శాశ్వత ఋగ్వేదం 8వ అధ్యాయం ప్రధమ సూక్తం 34వ మంత్రానికి ఋషి. ఇదే ప్రకారం. ఉశీజ్ ఈ అధ్యాయం 116 నుండి 121 వరకు మంత్రాల ఋషి. దశమ సూత్రానికి ఋషి బ్రహ్మవాదిని మమత. గాయత్రి వేదమంత్రమై నందున, వేదమంత్రాలు స్త్రీలు చదవకూడదు. కనుక వారికి గాయత్రీ ఉపాసన అధికారం లేదని కొంతమంది చెబుతుంటారు. అలాంటి వారు కొంచెం ఆలోచించాలి. వారు చెప్పింది నిజమే అయితే, వేదమంత్రాల ద్రష్టలుగా, వ్యాఖ్యాతలుగా, విశేషజ్ఞులుగా, అధిపతులుగా పైన చెప్పిన స్త్రీలు ఎలా కాగలరు? ప్రాచీనకాలంలో క్రేషా, గోధా, విశ్వవారా, అపాలా, ఉపనిషద్ జుహూ,అదితి, ఇంద్రాణి, సరమా, రోమశ, ఊర్వశి, లోపాముద్ర, యమీ, శాశ్వతీ, సూర్యా, సావిత్రీ మొదలైన బ్రహ్మవాదినులు వేద వ్యాఖ్యాతలుగా వున్నారు.
మను పుత్రిక ‘ఇడా’ పేరు గల ఒక మహిళ వర్ణన వున్నది. ఆమె ‘యజ్ఞాన్ కాశినీ’ బిరుదు పొందినది. ఆమె తన తండ్రి కోసం యజ్ఞం చేయించింది. భారద్వాజ పుత్రిక శృతావతి, ‘తపస్విని సిద్ధా, శాండిల్యుని పుత్రి శ్రీమతీ, వేదవిద్ శివా, బ్రహ్మ వాదిని సులభా, స్వధా పుత్రికలు విద్యునా మరియు. ధారిణీ మొదలైన – అనేక మంది వేదజ్ఞులైన మహిళల వర్ణన
విధానం ఎలా వుంటుంది?
వ్యోమ సంహితలో ఇలా చెప్పబడింది. “ఊర్వశి, యమీ, శచీ మొదలైన వారికి ప్రాప్తించినట్లుగానే స్త్రీలకు వేదాధ్యయన మరియు వైదిక కర్మకాండలు చేసే అధికారం వున్నది” యమ స్మృతిలో ఈ విధంగా వ్రాయబడి వుంది – స్త్రీలకు వైదిక కర్మకాండలవలెనే బ్రహ్మవిద్యను పొందే అధికారం కూడ వున్నది. వాల్మీకి రామాయణంలో కౌసల్య, కైకేయి, సీత, తార
మొదలయిన స్త్రీలు స్వయంగా సంధ్యా వందనం, హవనం చేసే మరియు స్వస్తి వాచనాది వేదమంత్రాలను పఠించే వర్ణన వున్నది. వశిష్ఠ స్మృతిలో ఈ విధంగా చెప్పబడింది – ‘స్త్రీ యొక్క మనసులో భర్త పట్ల దుర్భావనలు వస్తే ఆ పాప పశ్చాత్తాపానికి 108 సార్లు గాయత్రీ మంత్రాన్ని మహాభారతంలో వున్నది. వారికి వేదాధికార లేకపోతే ఏవిధంగా వేదజ్ఞులు కాగలరు?
శంకర దిగ్విజయంలో భారతీదేవి అ పేరుగల మహిళను గురించిన వర్ణన వున్నది ఆమె శాస్త్రార్ధంలో శంకరాచార్యుల వారి: ఓడించింది. వివాహాది సంస్కారాలలో స్త్రీలు తమ నోటితో అనేక మంత్రాలు ఉచ్ఛరించవలసివచ్చేది. యజ్ఞాలలో స్త్రీలు ఎల్లప్పుడూ భర్తతోనే వుంటారు. స్త్రీ లేకుండా యజ్ఞం ఫలించదు. రామచంద్రుడు బంగారు సీతను తయారుచేయించి యజ్ఞం పూర్తిచేయవలసి వచ్చింది. యజ్ఞం లేకుండా వేదాలు మంత్రాలకు చెందవు. స్త్రీలకు వేదాధికారం లేకపోతే వారు యజ్ఞంలో పాల్గొనడం లేదా వివాహాది సంస్కారాలలో మంత్రోచ్ఛారణ జపిస్తే ఆమె పవిత్రమవుతుంది.
మధ్యకాలంలో మహ్మదీయ . అంధకార యుగంలో నానారకాల నిందలు అపోహలు, ఆచారాలు, మన సమాజంలో వ్యాపించాయి. హిందూ జాతిని అన్ని రకాలుగా ఛిన్నాభిన్నంగా చేయడం కోసం ఆ విధంగా వ్యాపింపజేయ బడ్డాయని చెప్పవచ్చు. గ్రంధాలు మరియు ప్రాచీన పుస్తకాలలో భారతీయ సంస్కృతీ విచారధారను ఖండఖండాలుగా విచ్చిన్నం చేయగలిగే శ్లోకాలు కలుపబడ్డాయి. చొప్పించబడ్డాయి.. అలాంటి అపోహలలోనే స్త్రీలకు గాయత్రీ అధికారం లేదనేది ఒకటి. ఈ విషయంలో కొన్ని అర్ధం పర్ధం లేని శ్లోకాలను ఉల్లేఖించినా అవి భారతీయ సంస్కృతి అనాది ప్రవాహానికి ప్రతికూలంగా వున్న కారణంగా నమ్మశక్యంగా వుండవు.
కాశీలోని హిందూ విశ్వవిద్యాలయంలో ముందు స్త్రీల చేత వేదాలు చదివించేవారు. ఈ విషయంలో పునరాలోచించవలసిన అవసరం వచ్చినపుడు సనాతన ధర్మ కర్ణ ధారులైన పండిత మదన్ మోహన్ మాలవ్యాగారు దేశంలోని గొప్ప పండితులతో ఒక సమితిని ఏర్పాటు చేసి శాస్త్రాల ఆధారంగా స్త్రీలకు వేదమంత్రాల అధికారం వున్నదా లేదా అనే విషయాన్ని శోధించే కార్యాన్ని అప్పగించారు. కమిటీ చాలాకాలం వరకు శోధించి 1946 ఆగష్టు 22న సమర్పించిన రిపోర్టు ఆధారంగా మాలవ్యాగారు స్త్రీలకు కూడ పురుషుల మాదిరిగానే వేదాధ్యయన అధికారం వున్నదని ప్రకటించారు. అప్పటినుండి హిందూ విశ్వవిద్యాలయంలో స్త్రీలకు కూడ పురుషులకు లాగానే వేదాలు బోధిస్తున్నారు.
Source: