Home *చెట్లు పెంచడం పరమ పుణ్యం

*చెట్లు పెంచడం పరమ పుణ్యం

by

Loading

*చెట్లు పెంచడం పరమ పుణ్యం

ప్రజ్ఞా అభియాన్2011

*ప్రజ్ఞా అభియాన్‌ 16- 06-2011*

*చెట్టు పెంచడం పరమపుణ్యం*

భారతదేశానికి ధర్మమే ప్రాణం. ఇక్కడ పరోపకారంతో పుణ్యం సంపాదించుకోవాలనే భావన ప్రబలి ఉన్నది. ఈ భావనను వృక్షారోపణతో పర్యావరణ సంరక్షణ వంటి పవిత్ర

కార్యాలకు ఉపయోగించవచ్చు. శాస్త్రములలో వృక్షములను పెంచడం పిల్లలను పెంచడం కన్నా పుణ్యపరమార్ధ కార్యమని చెప్పబడింది.

*దశ కూప సమో వాపీ, దశ వాపీ సమో హృదః దశ హృద సమః పుత్రః దశ పుత్ర సమో దృమః*

*అర్ధం:* పది బావులు ఒక చెరువుకు సమానం. పది చెరువులు ఒక సరోవరానికి సమానం. 20 సరోవరాలు ఒక పుత్రునితో సమానం. ఒక వృక్ష్యాన్ని పెంచి ఫలింపచేస్తే అది పది మంది

పుత్రులను పెంచి పోషించిన పుణ్యం లభిస్తుంది, పుత్రులకు, మిత్రులకు సహాయం చేయడం ఎటువంటి పుణ్యకార్యమో దాని మీద సందేహం ఉండదు కాని ఇదేవిధంగా వృక్షమును

వికసింపజేయడం వల్ల లభించే అసాధారణ పుణ్యంపై ఎటువంటి సందేహం కూడదు. అవి ప్రాణ వాయువును (ఆక్సిజన్) ఇస్తాయి. ప్రదూషణ (కాలుష్యం) నివారణ, మనుషులకు జంతువులకు నీడ, ఆహారం, ఫల పుష్పములను ఇవ్వడం, వర్షములు కురవడంలో సహాయం, భూమి జల సంరక్షణలో సహయోగం వంటి ఎన్నో పుణ్య కార్యములు చేస్తాయి. వృక్షములు నాటడం, వాటిసంరక్షణ, పోషణ చేసేవారికి వాటి పుణ్యంలో భాగం తప్పనిసరిగా లభిస్తుంది. ఒక వైజ్ఞానిక అధ్యయనం ప్రకారం కొంచెం ఎదిగిన చెట్టు అందించే సేవాకార్యాలను ఆర్థికంగా లెక్క వేస్తే (50 సంవత్సరాలలో) ఒక కోటి రూపాయల కన్నా ఎక్కువ ఉంటుంది.

1.ప్రాణవాయువు. రూ 15,00,000

2.వాయు ప్రదూషణ నియంత్రణ, భూమి

యొక్క ఉత్పాదకతను వృద్ధి చేయడం

రూ. 31,00,000

3 భూమ్యాక్షరణ నియంత్రణ

రూ15,60,000

4. జల సంరక్షణ రూ. 18,80, 000

5.పశు పక్షుల ఆశ్రయం

రూ 16,60, 000

6.కట్టెలు ఫలములు పశువులమేత రూ. 4,00,000

మొత్తం =రూ. 1,01,00, 000

ఇది ఆర్థికవేత్తల స్థూలమైన లెక్కలు. కాని పోయే ప్రాణాన్ని రక్షించేందుకు ఇచ్చిన ఒక గ్లాసు నీటి విలువ డబ్బుతో ఎలా కొలవగలము?

ఈ విధంగా పృథ్వికి, పృథ్వి వాసులకు ప్రాణములను రక్షించే వృక్షముల సేవను డబ్బుతో లెక్కించుట మానవీయ విలువలను, సంవేదనలను

అవమానించడమే.