తన ఆత్మ ముందు సత్యవాది అయినవాడు, తన అంతరాత్మను అనుసరించేవాడు, ఆడంబరము, మోసము, చలాకీతనములను త్యజించి నిజాయితీ యే తన జీవననీతిగా ఉండేవాడు ఈ ప్రపంచంలో అందరికంటే తెలివైన వ్యక్తి. సత్యము తన మార్గముగా కలవాడు శక్తి పుంజముగా తయారవుతాడు. మహాత్మ కన్ఫ్యూషియస్ సత్యంలో వేయి ఏనుగుల బలముందని చెప్పేవాడు. కాని నిజానికి సత్యంలో అపారమైన బలమున్నది. భౌతిక సృష్టిలోని ఏ బలమూ దీనికి సమానం కాజాలదు.
అబద్ధం ఆఖరకు అబద్ధమేనని గుర్తుంచుకొండి. అది ఈ రోజు కాకపోయినా రేపైనా బట్టబయలు అవుతుంది. అసత్యం అనే కుండ పగిలినపుడు మనిషి యొక్క ప్రతిష్ట మొత్తం పోతుంది. అతనిని నమ్మదగనివాడు, తుచ్చమైన మరియు నీచమైన వాడుగా అనుకుంటారు. అబద్దం చెప్పినపుడు తాత్కాలికంగా కొంత లాభం ఉన్నట్లు కనిపించినా మీరు దాని వైపు ఆకర్షింపబడ వద్దు, ఎందువలననగా కొద్ది లాభానికి బదులుగా చివరకు అనేక రెట్ల హాని కలిగే అవకాశమున్నది.
మీరు మీ మాట మరియు పనుల ద్వారా సత్యాన్ని తెలియచేయండి. సత్యమనేది ఎటువంటి వస్తువంటే అది ఈ రోజు చిన్నదిగా కనపడినప్పటికీ చివరకు పూలు, పండ్లతో నిండిన విశాలమైన వృక్షంగా తయారవుతుంది. ఉన్నతమైన, ప్రతిష్టాత్మకమైన మరియు సుఖ శాంతులతో నిండిన జీవితాన్ని గడపాలనుకునే వారు వారి మాటలు మరియు పనులు నిజాయితీతో నిండి ఉండాలనే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి.
80
అఖండజ్యోతి 1947 జూలై వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ