Home year2023 అవధూత నుండి విముక్తి

Loading

ఓంకారేశ్వర్ నుండీ వచ్చిన సదానంద త్రిపాఠీ
గారు తమ అనుభవాన్ని ఇలా వివరించారు.
నర్మదానది పరిక్రమ చేసే క్రమంలో వచ్చే ఒక
బల్లకట్టు ప్రాంతంలోని సామాను తీసుకొని
వెళ్ళడం అంటే ప్రమాదాన్ని కొని తెచ్చుకోవటమే
అవుతుంది. ఎనిమిది, పదిమైళ్ళ దూరంలో ఉండే
ఈ ప్రాంతంలో ఒక జాతి ప్రజలు నివసిస్తూ ఉంటారు.
వారి ప్రవృత్తి దోపిడీలు చెయ్యటం. ఆ ప్రాంతం
నుండీ వెళ్ళే ప్రజలను కొల్లగొట్టకుండా వారిని
వెళ్ళనివ్వరు.
ఈ భేఢాఘాట్ నుంచీ కొంచెం ముందుకు వెళ్ళిన
తరువాత నర్మదానదీ తీరంలో ఒక సాధుసన్యాసి కనిపించాడు.
ఆ సాధువు నర్మదానదిలో స్నానం చేసి బయటకు వస్తున్నాడు.
ఆ సన్యాసి ఇలా అడిగాడు. ‘గురువును వెదుకుతూ బయల్దేరావా?
నువ్వు ఏ గురువు కోసం వెతుకుతున్నావో నేను కూడా వారి
శిష్యుడనే!’
సదానందుడు ఆ సన్యాసి మాటలకు సమాధానం
చెప్పకుండా ఆయన వంకే చూస్తూవుండిపోయాడు. అప్పుడా
సన్యాసి మీ గురువుగారి పేరు
– నా గురువుగారి పేరు
“స్వామీ ఓంకారానందుడే!” ఆయనే మిమ్మల్ని తీసుకురమ్మని
నన్ను మీ దగ్గరకు పంపించారు అని చెప్పాడు. అప్పుడు
సదానందుడు ‘ఆశ్రమం ఇక్కడకు ఎంత దూరం ఉన్నది?’
అని అడిగాడు. ఇక్కడ నుండీ కనీసం ఇరవై, ఇరవైఐదు
క్రోసుల దూరం ఉంటుంది. మనం సాయంత్రానికల్లా ఇల్లు
చేరుకోవాలి.
వీరిద్దరి మధ్య సంభాషణ జరుగుతున్నప్పటికే
మధ్యాహ్నం దాటిపోతున్నది. సాయంత్రానికల్లా
అంత దూరం పూర్తి చేయడమంటే కఠినమైన
విషయమే! కఠినమే కాదు, అసంభవమైనది
కూడా! ఆ సన్యాసి సదానందుడి సందిగ్ధావస్థను
‘గమనించి ఇలా అన్నాడు. ‘నీవు దిగులుపడకు.
మనం వేళకి అక్కడికి చేరుకుంటాము. స్వామీ
ఓంకారానంద అవధూత! మనం ఆ పరంపర
లోనే దీక్ష తీసుకుంటాము.’ సదానందుడికి
అవధూత శబ్దము వినగానే తటపటాయింపు
కోవకు
మొదలైంది. దిన సాధుసన్యాసులు లౌకిక
వ్యవహారమునకు తగినవారు కాదు అని ఆయన నమ్మకం.
వారి వద్ద కొన్ని సిద్ధులుంటాయి కానీ అవి సాధనాపథంలో
సహాయపడవు.
సదానందుడు తన అనుభవం గురించి చెప్తూ ‘ఆ
అవధూత అనే పదం వినగానే శరీరంలో షాక్ తగిలినట్లైంది.
చివురుటాకు మాదిరి వణికిపోయాను. ఎంత గాబరా
కలిగిందంటే వెంటనే వెనక్కితిరిగి వెళ్ళిపోదామని మనస్సు
తొందర చేయసాగింది’ అని అన్నారు. ఆ ఆలోచన రాగానే
సన్యాసి సదానందుడి చెయ్యి పట్టుకుని నీవు తిరిగి వెళ్ళిపోదా
మనుకుంటున్నావా? నేను నిన్ను అలా చెయ్య నివ్వను. నిన్ను
అవధూతబాబా వరకు చేర్చడం నా బాధ్యత. ఆ బాధ్యతను
నిర్వర్తించకుండా నేను ప్రక్కకు తప్పుకోను’ అని చెప్తూనే
ఈడ్చుకుపోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. సదానందుడు
బాగా బలిష్టంగా ఉన్న యువకుడు. ఆ సన్యాసిని తనతో పోలిస్తే కాస్త వృద్ధుడు కూడా! అతని శరీరంలో ప్రాణం
వుందా అని అనిపిస్తుంది కానీ వ్యక్తిత్వంలో మాత్రం వశీభూతం
చేసుకోగలిగే శక్తి అపారంగా ఉంది. తాను వివశుడనై
పోతున్నానా అని సదానందుడికి అనిపించింది. చేయి
విడిపించుకోలేకపోయాడు. నెమ్మదినెమ్మదిగా చైతన్యం కూడా
కోల్పోతున్నట్లనిపించింది.
తెలివివచ్చి చూసేసరికి తాను ఒక శిల మీద కూర్చొని
ఉన్నాడు. ఎదురుగా కొన్ని కుటీరాలు నిర్మించబడివున్నాయి.
ఒక కుటీరము ముందు తెల్లని జటాధారియైన సన్యాసి
దిగంబరంగా కూర్చొనివున్నారు. ఆ సన్యాసి ఎదురుగా ఒక
జింకచర్మము పఱిచివున్నది. అందరికన్నా ఎక్కువ వయస్సున్న
వారిలాగా కనిపిస్తున్న ఆ సన్యాసియే ఓంకారానందులవారు
కావచ్చు. ఆయన తన సైగల ద్వారా సదానందుణ్ణి తన
దగ్గరకు రమ్మని సైగ చేశారు.
దగ్గరకు వెళుతున్న సమయంలో సదానందుడికి భయం
వేస్తోంది. లోలోపల గాయత్రీమంత్ర జపం చేయసాగాడు.
జపం చేసుకుంటూ ఆశ్రమ ప్రాంగణంలో కూర్చొని వున్న
దిగంబర సన్యాసులను చూసుకుంటూ నడవసాగాడు. స్వామీ
ఓంకారానందులవారు సదానందుణ్ణి కూర్చోమని ఆదేశించారు.
సదానంద కూర్చోగానే, ఓంకారానంద ఇలా అన్నారు. నేను
నిన్ను విశేషమైన లక్ష్యసాధన కొరకు పిలిపించాను. నేను
నిన్ను ఇక్కడ అఘోరసాధన యందు దీక్షితుణ్ని చేస్తాను.’
అప్పుడు సదానందుడు ‘నేను ఈ సాధనల యందు
దీక్షితుణ్ణి కావాలనుకోవటం లేదు. నన్ను క్షమించండి”
అన్నాడు. అందుకు స్వామీ ఓంకారానంద ‘నీవు దీక్షితుడవు
కావాలనుకున్నావా లేదా అనేది కాదు. నేను నిన్ను దీక్షితుడను
చేసితీరవలసిందే. నీవు గతజన్మలలో నాకు చాలా సేవ
చేశావు. అందుకు నేను ఋణం తీర్చుకోవాలి’ అన్నారు.
అలా చెప్తూచెప్తూ స్వామీ ఓంకారానంద అకస్మాత్తుగా
మౌనం వహించారు. ఆయన మౌనమునందు స్తబ్ధతా భావం
కనిపించింది. అనుకోకుండా ఆయన ఏదో గుర్తుకువచ్చి…
ఆయన తన చర్చా విషయమును మార్చివేసి ‘అరే! నీవు
చేస్తున్న చతుర్వింశతిలక్ష అనుష్ఠానం పూర్తైంది. నీవు ఇప్పుడు
కూడా గాయత్రీమంత్ర జపం చేస్తున్నావు. ఈ సంఖ్య పూర్తైంది
కనుక నేను-నీ అనుమతి లభిస్తేనే నిన్ను దీక్షితుడిని చేయగలను”
అని అన్నారు.
ఇలా చెప్పిన తరువాత ఓంకారానంద చాలాసేపు మౌనం
గానే ఉండిపోయారు. ఆ తరువాత ఆయన ఆ సన్యాసిని
పిలిచి ‘నీవు ఇతడిని ఎక్కడనుండీ తీసుకువచ్చావో అక్కడే
వదిలేసిరా! ఇతడు తన స్వస్వరూపాన్ని తెలుసుకున్నాడు.
ఇప్పుడిక ఇతనిని మనం దీక్షితుడిని చెయ్యలేము’ అని చెప్పారు.
సన్యాసి తన గురువు ఆజ్ఞను పాటించి సదానందుడిని
నర్మదానదీతీరము వరకు తీసుకువచ్చి వదలివెళ్ళాడు. తిరిగి
వచ్చేటప్పుడు కూడా సమయము గురించి జ్ఞానమే కలుగలేదు.
అంటే ఎంత సమయం గడిచిందో తెలియలేదు. కొద్దిక్షణాలు
మాత్రమే గడిచినట్లనిపించింది.
గోష్ఠి యందు సదానందుడు తన ఈ అనుభవాన్ని
గురించి ఆచార్యశ్రీకి చెప్పానని తన సహచరులతో చెప్పాడు.
చాలా ఉత్సుకతతో అందరూ అందుకు ఆచార్యశ్రీ ఏమన్నారని
అడిగారు. గురువుగారు ఏమీ అనలేదని సదానందుడు
చెప్పాడు. అది విని అందరూ మౌనంగానే ఉండిపోయారు.
ఈ సంఘటన యొక్క రహస్యమేమిటని అడుగగా వారు
నవ్వి ఊరుకున్నారు. సదానందుడి అనుభవ సారాంశము
ఏమిటంటే ఆయన చేసిన గాయత్రీ సాధన ఆయనను ఆ
దిగంబర అవధూత అయిన అఘోరీవశములో చిక్కుకోకుండా
కాపాడింది, రక్షించింది.

అనువాదం: శ్రీమతి లక్కరాజు లక్ష్మీరాజగోపాలు
శ్రీమతి వల్లీశ్రీనివాస్

Yug Shakti Gayatri Jan 2023

You may also like