Home year2023 కర్తవ్యబోధ

Loading

గురుదేవులకు ఎప్పుడూ మోహం వుండేదికాదు. భార్య,
బిడ్డలు, ఇల్లు… ఇలా వేటిపట్లా ఆయనకు మోహం లేదు.
కర్తవ్యము పట్ల తత్పరత మాత్రం వుండేది. కర్తవ్యము, సేవ

  • ఈ రెండింటి నుండీ ఎన్నడూ ముఖం చాటుచెయ్యలేదు.
    కాళ్ళు, చేతులూ రెండింటితోనూ ఎప్పుడూ సేవ చెయ్యటానికే
    తహతహలాడేవారు.
    భార్య పట్ల వారి ప్రవర్తన? వారు పిల్లలు అందరి
    ముందూ మమ్మల్ని ‘మాతాజీ’ అని అనేవారు. వాళ్ళు
    లేనప్పుడు కూడా ‘మాతాజీ’ అనే పిలిచేవారు. దీనికి అర్థమేమి
    టంటే వారు మమ్మల్ని ఎప్పుడూ మాతాజీ అనే దృష్టితోనే
    చూచేవారు అని. ‘అమ్మ ఎప్పుడూ మోసం చెయ్యదు’ అనే
    వారు. వారి మాటలు నా అంతరంగపు లోతులను స్పృశించేవి.
    వారికోసం, ఈ సంస్థ కోసం నా జీవితమును సమర్పణ
    చేసుకున్నాను.
    ఏ మహిళయైనా బాధతో విచలితమై గందరగోళం
    పడేటటువంటి పరిస్థితులు మాకు ఎదురైనవని పరిజను
    లందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులలో మరొక స్త్రీయైతే
    మనస్సు దుర్బలమై అస్తవ్యస్తమైపోతుంది. కానీ మేము ఒకరి
    పట్ల ఒకరము ఎంతో గౌరవమూ, ఉదారత, సహృదయతతో
    మెలిగాము. 1960 వ సంవత్సరములో వారు అజ్ఞాతవాసంలోకి
    వెళ్ళినప్పుడు ‘మేము కూడా వస్తాము’ అని అడిగాము. మరల 1972 వ సంవత్సరములో వెళుతున్నప్పుడు గురుదేవులు ముందుగానే ‘నీవు నాతో రావొద్దు. నీవు కూడా నాతో వచ్చినట్లైతే సంస్థ మసకబారిపోతుంది. దీనిని ఎంతో శ్రమపడి
    నిర్మించుకున్నాను. మేము హిమాలయములకు వెళ్ళినప్పుడు
    నీవు దీని బాగోగులు చూసుకోవాలి. లక్షలాదిమంది పిల్లలైన
    మన పరిజనులకు నీవు తల్లివి! తల్లి తన బిడ్డలను సంరక్షించు
    కోవాలి కదా!’ అని అనునయించి చెప్పారు. 1960 లో గాయత్రీతపోభూమిలో వుండి అక్కడ అంతా
    నిర్వహించాము. పత్రికను, ఉత్తరప్రత్యుత్తరాలను, పరిజనులను
    అన్నింటినీ సంబాళించుకున్నాము.
    ఆచార్యులవారి తల్లిగారు వుండేవారు. ఆమెను మేము
    ‘తాయీజీ’ అని పిలిచేవారము. ఆచార్యులవారికి దేశము,
    సంఘము- వీటిపట్ల కర్తవ్యమే అధికముగా వుండేది. ఇక
    ఎవరిపట్లా మోహం వుండేదికాదు. వారు గ్రామాంతరములో
    వున్నప్పుడు వారి తల్లిగారు శివైక్యం చెందారు. నేను వున్నాను
    కదా! వారి స్థానములో నిలబడి యావత్ కార్యక్రమమును
    సక్రమముగా నిర్వహించినాను.
    మనిషిని మోహం, లోభము విచలితులను గావిస్తాయి.
    లోభానికి వారు వేల, లక్షల మైళ్ళ దూరములో వుంటారు.
    గాయత్రీ తపోభూమిని వదిలి శాంతికుంజ్ వచ్చారు. శాంతి
    కుంజ్ను వదిలి హిమాలయములకు వెళ్ళారు. లోభ మోహము
    లనే సంకెళ్ళు వారిని ఎప్పుడూ బాధించలేదు. మేము కూడా
    అదే రీతిలో వారి మార్గమును అనుసరించి పయనించాము.
    మేము కూడా మధురను, మా పరివారమును, పిల్లలను
    వదిలి సంతోషముగా వారి పదచిహ్నములను అనుసరించి
    శాంతికుంజ్కు వచ్చాము. గురుదేవులు మాకు అప్పగించిన
    బాధ్యతను ఆనందముగా స్వీకరించాము. మా భుజములకు,
    చేతులకు ఆ బాధ్యతను మోయగలిగినంత శక్తి, సామర్థ్యాలను
    ప్రసాదించమని వారిని ప్రార్థించాము.
    ఈ గాయత్రీపరివార్, యుగనిర్మాణపరివార్, అఖండ
    జ్యోతిపరివార్తో కూడిన కుటుంబమును మేము నిర్మించాము.
    లక్షలాదిమంది, కోట్లాదిమంది పరిజనులందరినీ ఒక్క
    కుటుంబముగా ఏర్పాటుచేశాము. ఇక ముందు కూడా
    చేస్తూనేవుంటాము. ఇందుకోసం ఏ వాగ్దానమైతే చేశామో
    దానిని నిలబెట్టుకుంటూనేవున్నాము. సేవ చేస్తున్నాము.
    ప్రత్యక్షమైనది కనపడుతుంది. పరోక్షమైనది కనపడదు.
    పరోక్షంగా కొంతమందికి సహాయము లభిస్తుంది. కానీ అది
    అందరికీ దృష్టిగోచరం కాదు.
    ఈవిధముగా మేము చేసిన వాగ్దానమును నిలబెట్టు
    కున్నాము, ఇకముందు కూడా నిలబెట్టుకుంటాము. ఐతే
    మీరు కూడా కొంచెం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి.
    మీ మార్గదర్శకులు మీ కోసం ఇంతగా ప్రయాసపడినారు
    కదా! మీరు కూడా సంస్థ కోసం ఎంతోకొంత చెయ్యటానికి
    ముందుకు రావల్సివుంది. ఇది మీ కర్తవ్యము! ఇది ఒక
    తండ్రి పిలుపు! తల్లి పిలుపు! మేము ఏవిధముగా సంస్థకు
    సమర్పణ చేసుకున్నామో అదే రీతిలో మీరు కూడా సమర్పణ
    చేసుకొనగలరని ఆశిస్తున్నాము. మా పరిజనులు ఈ
    విషయముపై దృష్టిసారించి అర్థం చేసుకుంటారనీ, తప్పక
    చేస్తారనీ మేము ఆశిస్తున్నాము.

అనువాదం : శ్రీమతి కామరాజు కృష్ణకుమారి

Yug Shakti Gayatri 2023 January

You may also like