చాలా ఎక్కువ సంఖ్యలో ప్రాపంచిక వస్తువులను భోగించగల ఏ వ్యక్తి పెద్దవాడు కాదు. అధికమైన ఐశ్వర్యమును కూడబెట్టగలిగిన వారిలో చాలా శాతం దోపిడీదారులై ఉంటారు. వారు ప్రపంచానికి ఎంత ఇస్తారో, అంతకు చాలా రెట్లు దాని నుంచి గుంజుతారు.
మనం మనిషి యొక్క సేవా శక్తిని దృష్టిలో ఉంచుకొని వానిని గొప్పవాడనలేము, వాని గొప్పదనానికి గీటురాయి ఇది కాజాలదు, ఎందుకంటే దాని ద్వారా పరీక్షించినపుడు చాలా పశు పక్షాదులు కూడ అదే వరుసలో వచ్చి కూర్చుంటాయి. ఎలుకలు, నక్కలు, పందులు, కుక్కలు, కాకులు, గ్రద్దలు లాంటి పశు పక్షులు కుళ్లిపోయిన, చెడిపోయిన పదార్థాలను మరియు మల మూత్రాదులను తిని వాతావరణాన్ని శుద్ధి చేస్తున్నాయని అందరకూ తెలుసు. క్రుళ్ళిపోయిన పదార్థాలను వేగంగా తొలగించాలనే ఉత్సాహం మనుష్యులన బడే మనలో కంటె వాటిలో చాలా ఎక్కువగా కనబడుతుందని స్పష్టమవుతుంది. కనుక చేసిన పని యొక్క పరిణామం కాని, పని చేయాలనే ఉత్సాహం కాని గొప్పదనానికి గీటురాయి కాజాలదు. కనుక మనిషికి పరీక్ష అతను చేసే పని యొక్క పరిణామంలో కాక ఆ పని చేయుటకు ప్రేరణ కలుగజేసే భావాలతో చేయ్యాలి. మనిషి భావాలెలా ఉ ంటాయో ఆ విధంగా అతనిని అర్థం చేసుకోవాలి. కృష్ణ భగవానుడు కూడా ఎం చెప్పాడంటే ” మనుషులందరి శ్రద్ద అతని అంత:కరణ కనుగుణంగా ఉంటుంది.” ఇందువలన ఏ పురుషుడు ఎంత శ్రద్ధ కలగి ఉంటాడో అతను స్వయంగా అలాగే ఉంటాడు.
అఖండజ్యోతి 1948 మార్చి 17వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ