ఇంద్రియాలకు దాసుడు కాకుండా యజమానిగా ఉండాలి. నిగ్రహం లేకుండా సుఖం, సంతోషం లభించవు. నిత్యం కొత్త కొత్త భోగాల వెనుక పరుగెత్తుట వలన దుఃఖం మరియు అశాంతి మాత్రమే లభిస్తుంది.
శ్రీమద్భగవద్గీత చదవటం, వినటం, అర్థం చేసుకున్న దానికి సార్థకత ఏమంటే ఇంద్రియములపై నిగ్రహం కలిగి ఉండడము. ఇంద్రియాల వేగం మరియు వాటి ప్రవాహంలో కొట్టుకొని పోవుట మానవ ధర్మం కాదు. ఏదైన సాధన అనగా యోగం, జపం, తపం, ధ్యానం మొదలైన వాటి ప్రారంభం ఇంద్రియ నిగ్రహం లేనిదే జరుగదు.
· నిగ్రహం లేనిదే జీవితంలో అభివృద్ధి ఉండదు. జీవితమనే సితార మీద హృదయలోకంలో మధురమైన సంగీతం దాని తీగలను నియమాలు, నిగ్రహాలు తోటి బిగించితేనే వినిపిస్తుంది.
ఏ గుర్రాన్నైతే స్వారీ చేస్తామో దాని కళ్లెలు మన చేతిలో లేకపోతే ఆ స్వారీ వలన ప్రమాదం కాక ఇంకొక్కటి కాదు. నిగ్రహమనే కళ్లెలను తగిలించినపుడే గుర్రాన్ని సరైన మార్గంలో నడిపించవచ్చు. సరిగ్గా మనసు అనే అశ్వం యొక్క పరిస్థితి కూడా ఇదే. వివేకం మరియు నిగ్రహం ద్వారా ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్నపుడే జీవనయాత్ర ఆనందంగా నడుస్తుంది.
విశృంఖలులైన యువకులు అపుడపుడు మానసిక, సామాజిక మరియు జాతీయ బంధనాలను తెంచుకోవాలనుకుంటారు. ఇది మన పొరపాటు. అర్జునునతో పాటు కృష్ణుడు ఎలా అవసరమో అలాగే జీవితంలో ఆవేశంతో పాటు వివేకం కూడా అదే ప్రకారం అవసరం. ఇదే బుద్ధిని స్థిర పరచే ఉపాయం.
65
అఖండజ్యోతి 1948 మే 14వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ