మనిషి అంతరంగంలో ఏ శుద్ధ-బుద్ధ చైతన్యం, సత్ చిత్ ఆనందం, సత్య-శివ-సందరం, అజరామర శక్తి ఉన్నదో అదే పరమాత్మ. మనసు-బుద్ధి-చిత్తం-అహంకారం అనే చతుష్ఠయాన్నే జీవి అంటారు. ఈ జీవి ఆత్మ నుండి భిన్నమైనది, మరియు అభిన్నమైనది. దీనిని ద్వైతమనవచ్చు మరియు అద్వైతమనవచ్చును. అగ్నిలో కట్టె మండి పొగ వస్తుంది. పొగ నుండి అగ్ని వేరు అని చెప్పవచ్చును. ఇది ద్వైతం. పొగ అగ్ని కారణంగా ఉత్పన్నమైనది, అగ్ని లేకుండా దానికి ఏ అస్తిత్వం లేదు. అది అగ్నిలోని భాగమే. ఇది అద్వైతం. అత్మ అగ్ని అయితే జీవి పొగ. రెండూ వేరనవచ్చు. లేక ఒకటన వచ్చు. ఉపనిషత్తులలో ఈ రెండిటిని ఒక చెట్టుపై కూర్చుని ఉన్న రెండు పక్షులతో పొల్చారు. గీతలో ఈ రెండింటి యొక్క అస్తిత్వాన్ని స్వీకరిస్తూ ఒక దానిని క్షర (నాశమగునది) మరియు రెండవదానిని అక్షర (నాశనము కానిది) మని చెప్పబడినవి.
భ్రమ వలన, అజ్ఞానం వలన, మాయవలన, సైతాను టక్కరితనం వలన ఈ రెండింటి ఏకత్వం భిన్నత్వంగా మారిపోయింది. ఇదే దుఃఖానికి, శోకానికి, సంతాపానికి, క్లేశానికి, వేదనకు కారణం. ఎక్కడ మనసు ఆత్మ ఒకటిగా ఉంటాయో, ఎక్కడ రెండింటి ఇచ్ఛ, కోరిక మరియు కార్యప్రణాళిక ఒకటిగా ఉంటాయో అక్కడ అపారమైన ఆనంద ప్రోతస్సు పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. ఎక్కడ రెండింటి మధ్య వ్యతిరేకత ఉంటుందో, ఎక్కడ వివిధ రకాలైన అంతర్ ద్వందాలుంటాయో రెండింటి ఇచ్ఛ, కోరిక, మరియు కార్య ప్రణాళిక ఒకటవాలి. అపుడే జీవితంలో నిజమైన శాంతి యొక్క దర్శనమౌతుంది.
77
అఖండజ్యోతి 1947 ఏప్రిల్ 2-4వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ