Home year1945 జ్ఞానమును ఉపాసించండి

జ్ఞానమును ఉపాసించండి

by Akhand Jyoti Magazine

Loading

జ్ఞానం ద్వారానే మనిషి ప్రపంచంలో సుఖం పొందుతాడు, దీని లోపం వలనే బంధనాలలో చిక్కుకొని దు:ఖాన్ని పొందతాడు. సంపూర్ణమైన జ్ఞానం కలవారితోనే విజయం వెంట వస్తుంది. జ్ఞానంలో దోషము వచ్చుట వలన, అపజయాల ఆధిక్యం వలన మనిషి దుఃఖితుడౌతాడు. ఈ ప్రపంచంలో జ్ఞాన్నాని మించిన పవిత్రమైన వస్తువేదీ లేదు. ఇది ఆత్మ యొక్క స్వాభావిక గుణము. భగవంతుడు జ్ఞాన స్వరూపుడు. జ్ఞాన ప్రకాశం ద్వారా అజ్ఞానపు అంధకారం దూరమైనపుడే, మనిషి జనన మరణాలు లేనటు వంటి ముక్తి మార్గపు యాత్రికుడు అవుతాడు. ఇటువంటి జ్ఞాని అయిన పురుషుడు అన్ని అవస్థలలో తనను తాను భగవంతునికి అర్పించుకుంటాడు.

మనం బాహ్య విషయాలలో ఏ సుఖాన్ని వెదుకుతామో నిజానికి అవి మనలోనే ఉన్నవి. ప్రపంచంలోని ప్రతి ఒక్క భావోద్వేగాలను పరీక్షించడం, సత్యా – అసత్యాల యదార్ధాన్ని గుర్తించటం, మనకు ఉ పయోగపడు వస్తువులను స్వీకరించటం, పనికిరాని వస్తువులను వదిలివేయడం, ఇవన్ని జ్ఞానం ద్వారానే సాధ్యమౌతాయి. ఈ జ్ఞానం స్వాధ్యాయము మరియు సత్సంగంతో లభిస్తుంది. సధ్ధాంధాలను పఠించటం, అధ్యయనం చేయుట మరియు జ్ఞానుల సత్సంగం-సమయం మరియు అనుకూలతలను పొందటం, మనిషి జీవితాన్ని సరిచేయుటకు అత్యవసరం. ఏ సమాజంలో లేదా ఏ దేశంలో నిజమైన జ్ఞానుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ సమాజం లేక దేశం అంతే అధికంగా ఆత్మోన్నతి జరుగుతుంది, అదే ఆశించిన లక్ష్యాన్ని చేరుకుంటుంది.

అఖండజ్యోతి 1945 లోప్రిల్ 69వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ

You may also like