నీవు భగవంతుని సగం శక్తి మధ్యలో నిలబడి ఉన్నావు, నీ పైన దేవతలు, సిద్ధులు, అవతార పురుషులు ఉన్నారు మరియు నీ క్రింద పశు పక్షాదులు, క్రిమి- కీటకాలు మొదలైనవి ఉన్నాయి. పై నున్న వారు సుఖాలు మాత్రమే అనుభవిస్తున్నారు క్రిందనున్న వారు దుఃఖాలను మాత్రమే అనుభవిస్తున్నారు. మనుష్యుడు నీవు మాత్రమే సుఖ దుఃఖాలు రెండిటిని కలిపి అనుభవిస్తున్నావు. నీవు కోరుకుంటే పశుపక్షాదులు అవ్వవచ్చు, లేదా దేవతలు, సిద్ధులు, అవతార పురుషులు కూడా కావచ్చు.
క్రిందకి వెళ్లదలచుకుంటే తిను, త్రాగు, ఆనందించు. నీకు సుఖాల కొరకు ధనం కావాలి, అది న్యాయంగా లభించని లేక అన్యాయంగా అయినా సరే. క్రిందికి రావడానికి బాధ లేక కష్టం ఏమీ లేదు. కొండ పై నుంచి క్రిందకి రావడానికి ఆలస్యం ఉండదు. ఇదే విధంగా నీ భాగ్యాన్ని నాశనం చేసుకోదల్చుకుంటే చేసుకోవచ్చు గాని తరువాత పశ్చాత్తాప పడవలసి రావచ్చు. పైకి వెళ్లదలుచుకుంటే సత్యం-మిథ్యా, న్యాయం-అన్యాయం, ధర్మం-అధర్మం అనే గొప్ప గొప్ప ఆలోచనలు చేయవలసి రావచ్చు. పర్వతం పైకి ఎక్కడానికి కష్టపడవలసి రావచ్చు. కాని కష్టానికి ఫలితమైన సుఖం కూడా లభిస్తుంది. నీవు కష్టాల దు:ఖాన్ని తలపైకెత్తుకుంటే సౌఖ్యవంతుడవు కాగలవు. రెండు మాటలూ నీ విషయంలో సరైనవే. కారణం నీవు మధ్యలో నిలబడి ఉన్నావు. మధ్యలో ఉండే వారు ముందు వెనుక బాగా చూడగలరు. నీవే నీ భాగ్య నిర్మాతవు. ఏదైనా చేయగలవు అందుకు అనుకూలమైన సమయం ఇదే, సమయం గడిచిపోతే పశ్చాత్తాపమే చేతిలో మిగులుతుంది.
అఖండజ్యోతి 1943 నవంబర్ 202వ పేజీ
https://chat.whatsapp.com/LYfpk5836TQERzAv5kcUxs