Home year1944 ప్రేమే సుఖ-శాంతులకు మూలం

ప్రేమే సుఖ-శాంతులకు మూలం

by Akhand Jyoti Magazine

Loading

భగవంతుడు తన సృష్టి అందంగా మరియు వ్యవస్థితంగా ఉండుటకు జడ, చైతన్య పదార్ధాల మధ్య సంబంధం ఏర్పరచాడు. నిఖిల విశ్వబ్రహ్మాండం. యొక్క గ్రహ నక్షత్రాలు వాటి వాటి సౌరమండలాలలో ఆకర్షణ శక్తి ద్వారా ఒకదానితో ఒకదానికి సంబంధం కల్పించాడు. ఈ సంబంధ సూత్రం తెగిపోతే దేనికీ స్థిరత్వం ఉండదు. అన్ని గ్రహాలు, నక్షత్రాలు ఒకదానితో ఒకటి కొట్టుకొని సంపూర్ణ వ్యవస్థ నాశనమౌతుంది. ఇదే ప్రకారం పరస్పరం ప్రేమ సంబంధం లేకపోతే జీవుల అస్తిత్వం కూడా స్థిరంగా ఉండదు. తల్లికి బిడ్డ మీద ప్రేమ లేకపోతే, భర్తకు భార్య మీద ప్రేమ లేకపోతే, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే కుటుంబం ఎటువంటి దయనీయ స్థితిలో ఉంటుందో ఉహించండి. ఈ సోదర ప్రేమ, స్నేహ సంబంధాలు నశించిపోతే సహకారం ఆధారంగా నడిచే అన్ని సామాజిక వ్యవస్థలు పూర్తిగా నష్ట-భ్రష్టమై పోతాయి. సృష్టిలో సౌందర్యం మొత్తం పోతుంది.

ప్రతి ప్రాణి హృదయంలో ప్రేమ యొక్క నిరంతర ప్రవాహం ప్రవహిస్తుంది. మనం సుఖం, శాంతి మరియు సంపదను ఇష్టపడితే ప్రేమ భావాన్ని కలిగి ఉండటం ఆవశ్యకం. ఇతరులతో ఉదారత, దయ, మాధుర్యం, పెద్దమనస్సు కలిగి ఉండటం, నిజాయితీగా వ్యవహరించండి. ఎవరైతే తమ జీవన నీతిని ప్రేమమయం చేసుకున్నారో, వారు భగవంతునిచే ప్రసాదించబడిన మానవోచిత ఆజ్ఞ పాటించే ధర్మాత్ములు. అటువంటి వారికి ప్రతినిత్యం సత్య యుగమే. ఎందువలననగా వారు స్వయంగా సత్యయుగీయులు, అందువలన ఇతరులు కూడా వారితో పాటు సత్యయుగపు ఆచరణ చేయక తప్పదు.



అఖండజ్యోతి 1944 ఫిబ్రవరి 46వ పేజీ
https://chat.whatsapp.com/LYfpk5836TQERzAv5kcUxs

You may also like