శరీరం పెరుగుట కొరకు భోజనం, నీరు, గాలి, తగిన పరిమాణంలో దొరకటం ఆవశ్యకం. ఇవి లేకుండా శరీరం పూర్తిగా అభివృద్ధి చెందటం అసంభవం. ఇదే విధంగా మనసుకు సంపూర్ణ భోజనం ఉత్తమమైన ఆలోచనలు. వీటి లోపం వలన మనిషి మనసు పనికి రాకుండా పోతుంది. స్వాధ్యాయం, సత్సంగం, మననం, చింతన, మొదలైనవి లేకుండా మనిషి మెదడు పశు శ్రేణిలోనే నిలిచి ఉంటుంది. ఏ విధంగా శరీరం కొరకు సంతులిత భోజనం, మనసు కొరకు ఉత్తమ ఆలోచనలు అవసరమౌతాయో అదే విధంగా జీవాత్మను ఆరోగ్యంగా ఉంచుటకు, బలోపేతం చేయుటకు మరియు అభివృద్ధి చెందించుట కొరకు ప్రతినిత్యం భగవత్సాధన యొక్క సంతులిత భోజనం అవసరమౌతుంది. ఏ విధంగా భోజనలోపం వలన శరీర అభివృద్ధి ఆగిపోతుందో, ఉత్తమమైన ఆలోచనలు మనసుకు లభించకపోవటం వలన మనసు పనికిరానిదై పోతుంది, మరియు తన సంపూర్ణ వికాస స్థితి భగవంతుని పొందకుండా వంచించబడుతుంది.
జీవాత్మను నిర్మలం చేయుట ద్వారానే దివ్యతత్వముల ఉనికి తెలుస్తుంది. అందువలన ఏ విధంగా ఇంటిని శుభ్రం చేయుట కొరకు చీపురుతో చిమ్ముట, బట్టలు శుభ్రం చేయుట కొరకు సబ్బు ఉపయోగిస్తామో, శరీర శుభ్రత కొరకు స్నానం అవసరమో అదే విధంగా ప్రపంచంలోని దుష్ప్రవృత్తుల ప్రభావంతో జీవాత్మపై కూడే కుసంస్కారాలు మరియు మల విక్షేపాలను తొలగించుట కొరకు భగవంతుని పవిత్రనామాల ఉచ్ఛారణ మరియు ఆయన గుణాలను చింతన చేయడం అవసరమౌతాయి.
249
అఖండజ్యోతి 1960 మార్చి 19-21 పేజీలు
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ