మనం ఎల్లపుడు ఎటువంటి ఆలోచనలు చేస్తామో అవే ఆలోచనల అణువులు మన మెదడులో ప్రోగుపడుతాయి. మన మెదడును సరైన మరియు మంచి పనుల కొరకు ఉపయోగిస్తూ, దానిని సోమరిగాను పనిలేకుండగను ఉంచకుండ చేస్తే, మానసిక శక్తి అభివృద్ధి చెందుతుంది.
మన మెదడును ఉత్తమమైనదిగా లేక తుచ్ఛమైనదిగా చేసుకొనడం మన చేతిలోనే ఉంది. ఆలోచించు, విశ్లేషించు, మననం చేయి. కోపగించుటవలన క్రోధం కలిగించే అణువుల సంఖ్య వృద్ధి చెందుతుంది. చింత, శోకం, భయం లేక దుఃఖం కలిగి ఉండుట వలన ఈ చెడు ఆలోచనల అణువులను నీవు పోషిస్తావు, మెదడును బలహీన పరుస్తావు. గతంలో జరిగిన దుర్ఘటనలు, దుఃఖం కలిగించే మాటలు గుర్తు చేసుకొని దుఃఖం మరియు శోకమునకు వశుడవై మెదడును బలహీనం చేయవద్దు. శరీరంలో బలమున్నప్పటికీ దానిని నిరుపయోగంగా ఉంచుట వలన బలహీనపడ్తుంది.
అదే విధంగా ఆలోచించని మెదడు కూడా బలహీన పడ్తుంది. కొత్త ఆలోచనలను, మనసులోనికి ఆహ్వానించటం ద్వారా మెదడు యొక్క మానసిక వ్యాపారం విస్తృతమౌతుంది; మనసు వికసిస్తుంది, జీవితం లేక బలం యొక్క వృద్ధి జరుగుతుంది. మనసు లేక బుద్ధి తేజోవంతమవుతుంది. మన మనసులో ఏ ఆలోచనలున్నాయో అవే మన జీవితాన్ని నిర్మిస్తాయి. ఏ కళను గురించి ఆలోచిస్తామో మరియు అభ్యాసం చేస్తామో అందులోనే నైపుణ్యం సంపాదిస్తాము. మెదడులోని ఏ భాగాన్ని ఉపయోగిస్తావో ఆ భాగంలోని శక్తులు అభివృద్ధి చెందుతాయి.
అఖండజ్యోతి 1946 జూలై 10వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ