Home year1947 మిమ్ములను ఆవేశాల నుంచి కాపాడుకొండి

మిమ్ములను ఆవేశాల నుంచి కాపాడుకొండి

by Akhand Jyoti Magazine

Loading

జీవితాన్ని సమున్నతంగా చూడాలనుకునే వారు వారి స్వభావాన్ని గంభీరంగా ఉంచుకోవడం ఆవశ్యకం. తడబడటం, పిల్లచేష్టలు, వెకిలితనం, అలవాటైన వారు ఏ విషయాన్ని గురించి లోతుగా అలోచించలేరు. ఏదైన సమయంలో మనసును ఉత్సాహపరుచుకొనుటకు పిల్లచేష్టలు చేయవచ్చు కాని అటువంటి స్వభావాన్ని అలవర్చుకొనరాదు. సముద్రం ఒడ్డున ఉన్న పర్వతం తనకు తగిలే అలలను లక్ష్యపెట్టనట్టు ఆవేశాలను దూరంగా ఉంచటం అనే అలవాటును చేసుకోవాలి. ఇదే విధంగా మనం ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆటగాడు ఆటలు ఆడతాడు, ఎన్నోసార్లు గెలుస్తాడు, ఎన్నోసార్లు ఓడుతాడు, ఎన్నోమార్లు ఓడిపోతూ గెలుస్తాడు, ఎన్నోమార్లు గెలుస్తూ ఓడుతాడు ఏ ఆటగాడు వీటి ప్రభావం తన మనసు పై అధికంగా పడనివ్వడు.

ఓడిన వాడి పెదవులపై సిగ్గుతో కూడిన చిరునవ్వు ఉంటుంది, గెలిచిన వాడి పెదవులపై ఉండే చిరునవ్వు విజయంతో కూడిన దరహాసం అవుతుంది. ఈ కొద్ది స్వాభావికమైన భేదం తప్ప ఇక ఏ విశేషమైన తేడా గెలిచిన మరియు ఓడిన ఆటగాళ్ళలో కనబడదు. విశ్వం అనే రంగస్థలం మీద మనందరం ఆటగాళ్ళమే. ఆడటంలో రుచి ఉంది. ఈ రసం రెండు జట్లకు సమమైన రూపంలో లభిస్తుంది. గెలుపు ఓటములు ఆ రుచితో పోల్చితే లెక్కలోకి రావు. సుఖ-దు:ఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు కారణంగా ఉత్పన్నమైన ఆవేశాల నుండి దూరంగా ఉండటమే యోగం యొక్క సాఫల్యం.

అఖండజ్యోతి 1947 మే 5వ పేజీ

78 https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ

You may also like