జీవితాన్ని సుఖమయం, శాంతిమయం చేసుకొనుట కొరక సౌకర్యములు సాధనములు అవసరం అని తెలుస్తుంది. అయితే మంచిదే దాని కొరకు కూడా ప్రయత్నం చేయాలి. లభించినంత వరకు సదుపయోగం చేయాలనే విషయాన్ని కూడా మరిచిపోకూడదు. లభించిన సాధనములను సదుపయోగం చేయడం మనం నేర్చుకుంటే, ప్రతి వస్తువును మితంగా ఉపయోగించుకుంటే, దాని నుంచి పూర్తి లాభం పొందగల్గితే ఏ కొద్దిగా లభించిందో అదే మన ఆనందాన్ని అనేక రెట్లు పెంచగలదు. నీ ధర్మపత్ని ఏ స్థాయిలో ఉన్నా, ఆమెకు ఇంకా అధికమైన శిక్షణ, అధిక యోగ్యురాలిగా తయారుచేయగలిగితే మరియు ఆమె స్వభావం మరియు గుణాలను మీ కార్యక్రమాలలో సరిగా ఉపయోగించకోగలిగితే, ఆ భార్యే ఏ విధంగా నేడు వ్యర్ధమైన భారంగా అనిపిస్తుందో, అత్యంత ఉపయోగకరం మరియు లాభదాయకంగా కనిపిస్తుంది. నేడు ఎంత ఆదాయం లభిస్తున్నదో దానిని ఖర్చు చేయుటంలో వివేకం మరియు మితవ్యయంగా ఒక ప్రణాళిక తయారు చేయగలిగితే దాని వలన ప్రతి ఒక్క పైసా ద్వారా అధిక లాభం పొందగలిగితే ఈ రోజు ఉన్న కొద్ది పాటి ఆదాయంతో కూడా ఆనందం మరియు సౌకర్యాలలో అనేక రెట్లు అభివృద్ధి చేయవచ్చును. దీనికి బదులుగా మీ దృషికోణం అస్తవ్యస్తమైతే పెద్ద పరిమాణంలో సుఖ సాధనాలు లభించినప్పటికీ అవి ఏ కొద్ది లాభాన్ని కలిగించలేవు. అంతే కాక “ప్రాణము యొక్క జంజాటము” గా తయారై కలతలు మరియు ఇబ్బందులు కలుగచేస్తాయి. కనుక మనం మన దృష్టికోణంలోని పొరపాట్లు తెలుసుకొని వాటిని సరి చేసే ప్రయత్నం చేయాలి.
250
అఖండజ్యోతి 1980 ఏప్రిల్ 7వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ