కష్టంలో నీకు సహాయపడే వారు మరియు చెడు నుంచి రక్షించే వారు, మరియు నిరాశలో ఆశను చిగురింప జేసే శక్తి కలవారి ప్రేమకు పాత్రులు కాగలుగుటకు ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి.
ముఖస్తుతిగా మాట్లాడే వాళ్లు మన చుట్టూ తేలికగా చేరుతారు. స్వార్ధపరులైన మిత్రులు క్షణంలో ఒకే చోట పోగుపడతారు. కఠినమైన విమర్శ చేసేవాళ్లు, శ్రేష్ఠమైన సలహా ఇచ్చేవాళ్లు చివాట్లు పెట్టగలిగేవాళ్లు మరియు ఆపదల యందు హెచ్చరించ గలవాళ్లు దొరకటం చాలా కష్టం. రాజుల మరియు షాహుకార్ల స్నేహం చాలా విలువైనదని అనుకుంటారు. కాని అన్నిటికంటే ఉత్తమమైన మైత్రి గొప్ప ఆత్మ కల ధార్మిక పురుషులది. పెట్టుబడి లేనివాడు వ్యాపారి ఎలా కాగలడు? నిజమైన మిత్రులు లేనివాడు. బుద్ధికలవాడు ఎలాగౌతాడు? ఉన్నతిని పొందే సాధనాలలో శ్రేష్ఠమైన మిత్రుల సహకారం పొందటం చాలా విలువైనది. ఎక్కువ మందితో శత్రుత్వం కలిగి ఉండటం మూర్ఖత్వం అవుతుంది కాని దానికంటే పెద్ద మూర్ఖత్వం మంచి వ్యక్తుల స్నేహాన్ని వదిలేయడం.
నిర్మలమైన బుద్ధి, శ్రమలో శ్రద్ధ అనే ఈ రెండు విషయాలే మనిషిని మహానుభావునిగా చేస్తాయి. ఉత్తమమైన గుణాలు సంపాదించటం ద్వారా అట్టడుగున ఉన్న వ్యక్తి గొప్పవాడు కావచ్చు. దుర్గుణాలు కలిగి ఉండటం ద్వారా ఉన్నత వ్యక్తి దిగజారవచ్చు. నిరంతరం తత్పరత, జాగ్రత్త మరియు సమయం యొక్క సదుపయోగం అనే లక్షణాలు చిన్నవారిని గొప్పవారిగా మార్చుతాయి. మరియు నీచమైన వారిని సజ్జనునిగా మార్చుతాయి.
అఖండజ్యోతి 1942 ఏప్రిల్ 14వ పేజీ https://chat.whatsapp.com/LYfpk5836TQERzAv5kcUxs
28