సుఖం ధనం పై ఆధారపడి ఉండదు. బదులుగా సతానం మరియు ఆత్మనిర్మాణాల పై ఆధారపడి ఉంటుంది. ఆత్మజ్ఞానం ద్వారా తన దృష్టికోణాన్ని ఉన్నా బాగా సంస్కరించుకొనే వాడు అతని వద్ద సాధన, సంపత్తులు లేకపోయినా ఎట్టి పరిస్థితులలోనైనా సుఖంగా ఉంటాడు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ అతను వాటిని తనకనుకూలంగా నిర్మించుకోగలుగుతాడు. ఉత్తమగుణాలు మరియు ఉత్తమ స్వభావం కల మనుష్యులు చెడ్డవ్యక్తుల మధ్య ఉన్నప్పటికీ మంచి అవకాశాలను పొందగలుగుతారు.
ఆలోచనాపరులైన మనుష్యులకు నిజానికి ఈ ప్రపంచంలో ఎటువంటి కష్టాలు ఉండవు. శోకం, దుఃఖం, చింత మరియు భయం అనేవి ఒక్క క్షణం కూడా వారి దగ్గరకు చేరలేవు. ప్రతి స్థితిలోను వారు ప్రసన్నత, సంతోషం, మరియు సౌభాగ్యాలను అనుభూతి చెందుతారు.
సత్జ్ఞానం ద్వారా ఆత్మనిర్మాణం చేసుకొనుట వలన కలిగే లాభం ధనం కూడబెట్టటం వలన వచ్చే లాభం కంటే ఎన్నోరెట్లు మహత్వపూర్ణమైనది. నిజంగా ఎవరు ఎంత జ్ఞానం కలవారో వారు అంత గొప్ప ధనవంతులు. నిర్ధనుడైన బ్రాహ్మణునకు ధనవంతులైన ఇతర కులాల వారి కంటే అధికమైన గౌరవము లభించుటకు కారణం ఇదే.
మనిషికి అన్నిటి కంటె గొప్ప పెట్టుబడి జ్ఞానం. ఈ కారణంగానే వాస్తవికతను తెలుసుకో. ధనం వెనుక రాత్రి పగలు పిచ్చివాని వలె తిరిగే కంటే సత్జ్ఞానాన్ని పోగు చేసుకో. ఆత్మ నిర్మాణం వైపు నీ అభిరుచిని
81
అఖండ జ్యోతి 1947 జూలై 2వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ