ఈ ప్రపంచంలో ఏ రకమైన దోషము లేనివాడు, లేదా ఎప్పుడూ ఏ తప్పూ చేయనివాడు ఎవరూ లేరు. కాబట్టి ఎవరైనా తప్పు చేస్తే కోపం తెచ్చుకోవద్దు లేదా వారి చెడు కోరవద్దు.
ఇతరులకు సలహాలివ్వడం నేర్చుకోవద్దు. నీకు నీవు సలహా ఇచ్చుకొని దానిననుసరించి నడచుకో. ఇతరులకు సలహా ఇచ్చేవారు స్వయంగా పాటించరు. తమ సలహా ప్రకారం నడుచుకోరు, వారు తమనుతాము మరియు ప్రపంచాన్ని కూడా మోసం చేస్తుంటారు.
నిజమైన సంపాదన ఏమిటంటే అన్నిటికంటే ఉత్తమమైన సద్గుణాలను కలిగి ఉండడం. ప్రపంచంలోని ప్రతి ప్రాణి ఏదో ఒక సద్గుణాన్ని కలిగి ఉ ంటుంది. కాని ఆత్మగౌరవం అనే గుణం పరమేశ్వరుడు మనిషికిచ్చిన అన్నిటికంటే గొప్ప వరం. ఈ గుణంతో శోభిస్తున్న ప్రతి ఒక ప్రాణిని ప్రపంచంలోని సమస్త ప్రాణులు తమ ఆత్మ వలె చూడాలి. వారి మనసులో ఎల్లపుడూ ఎటువంటి సంకల్పము ఉండాలంటే వారి మనసు, మాట మరియు చేతలు వేటి ద్వారా కాని ప్రపంచంలోని ఏ జీవికి కష్టం కలుగకూడదు. ఇటువంటి స్వభావం ఉన్నవారు చివరకు పరబ్రహ్మను పొందుతారు.
నీ మిత్రులు, సహచరులు, భార్య పిల్లలు, నౌకర్లు, చాకర్లను బెదిరించడము వలన కాని, మోసం ద్వారానే చెప్పిన మాట వింటారు అనే ఆలోచనను వదలుకో. నిజం దీనికి పూర్తిగా వ్యతిరేకం. ప్రేమ, సానుభూతి, గౌరవం, తీయని మాటలు, త్యాగం మరియు నిరంతర సత్యమైన వ్యవహారంతో మాత్రమే నీవు ఎవరినైనా నీ వారిని చేసుకొనగలవు.
82
అఖండజ్యోతి 1947 జూలై 4,5 పేజీలు
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ