జగత్పిత పరమాత్మ తన సృష్టిలో సంకుచితత్వము, సంకీర్ణత లేదా దారిద్యమునకు స్థానం ఇవ్వలేదు. ఈ కుత్సితమైన విషయాలు ప్రపంచంలో లేవు కాని మన అంతరంగంలోనే గడ్డి గాదం మాదిరిగా పుట్టుకొచ్చాయి. అంత:కరణంలో ఉత్పన్నం అయి ఇవి మన ఆత్మబలం, నిగూఢ సామర్ధ్యాలను హరించివేస్తాయి. ఇదే కారణం అనేక వ్యక్తులు శారీరికంగా ఎదిగినట్లు కనిపించినా కాని మనసు, బుద్ధి, అంతరంగం మరియు సామర్ధ్యముల అభివృద్ధి కొద్దిగా కూడా కనపడదు.
ఈ ప్రపంచంలో దు:ఖాన్ని కలిగించే శక్తి ఒకటే ఉన్నది, అదేమంటే మనిషి చేసే దుష్కర్మలు. ఆలోచన మరియు కర్మలో భేదం ఏమీ లేదు. ఆలోచన విత్తు అయితే కర్మ ఆ విత్తనం నుంచి పుట్టిన వృక్షము. సుఖ, దు:ఖములనేవి ఆ చెట్టు యొక్క చేదు మరియు తీపి ఫలాలు. విచారకరమైన విషయమేమంటే సమృద్ధి భాండాగారం అయిన ఈ ప్రపంచంలో ఉంటూ కూడా మనం మన ఆత్మను సంకుచితం చేసుకుంటున్నాము. అందులో దురదృష్టములనే నిరుత్సాహ పూరిత ఆలోచనలను నింపుతూ భయం కలిగించే దరిద్రం లేదా పేదరికం అనే పిచ్చి పిచ్చి ఆలోచనలలోనే మునిగి ఉంటాము. ఎంత ఎక్కువగా మనం దరిద్రమైన సంస్కారాలతో అతుక్కుపోయి ఉంటామో అంత అధికంగా దుఃఖితులమౌతుంటాము. ఇదే మనందరి పెద్ద తప్పిదం బుద్ధి తక్కువ, అదృష్టం తలక్రిందులైంది, పేదరికమే రాసి ఉ ంది’ అనే ఆలోచనలను మీ మెదడులో గుమిగూడనియ్య వద్దు, అప్పుడు నిశ్చయంగా మన జీవితం పరిపూర్ణం మరియు ఐశ్వర్యవంతమౌతుంది.
అఖండజ్యోతి 1945 సెప్టెంబర్ 196వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ