కాయకష్టం చేసిన తరువాత ఆకలితో ఉండి తిన్న వానికే ఆహారం రుచి తెలుస్తుంది. చెమటోడ్చి సంపాదించిన వానికే ధనం విలువ తెలుస్తుంది. అనేక కష్టాలు, బాధలు మరియు అపజయాలతో సంఘర్షించిన వానికే విజయం యొక్క విలువ తెలుస్తుంది. విపరీత పరిస్థితులు మరియు బాధల మధ్య చిరునవ్వుతో ఉండి ప్రతి అపజయం, తరువాత గొప్ప ఉత్సాహంతో ముందుకు పోవుట తెలిసినవాడు నిజానికి విజయలక్ష్మిని పోందటానికి అర్హుడు.
విజయ పధంలో ఎదురయ్యే ఆలస్యాన్ని ఓర్పుతో ఎదురు చూడలేని వారు, కోరినది పొందటానికి మార్గ మధ్యంలో వచ్చే కష్టాలతో యుద్ధం చేయడం తెలియనివారు, తమ అయోగ్యత మరియు తమ తెలివితక్కువ తనమునకు అదృష్టం కారణమని తాము నిర్దోషులమనిపించుకొనుటకు హాస్యాస్పదమైన ప్రయత్నం చేస్తారు. ఇటువంటి ఆత్మవంచన వలన లాభం లేకపోగా హాని అపారమైనది. అన్నిటికంటే గొప్ప హాని ఏమంటే తన దురదృష్టాన్ని నమ్మే మనిషి ఆశ యొక్క ఉనికిని గుర్తించలేడు మరియు నిరాశ అనే అంధకారంలో తిరుగుతూ ఉండుట వలన కోరినది పొందటానికి క్రోసుల దూరం వెనుకబడి ఉంటాడు.
బాధలు, కష్టాలు, విపత్తులు మరియు అపజయాలు ఒక రకమైన గీటురాయి వంటివి, దాని పైన పాత్రత – అపాత్రత, అసలు-నకిలీల పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్షలో ఎవరు శుద్ధంగా బైటపడ్తారో వారు విజయానికి హక్కుదారులౌతారు, వారికే కోరినది లభిస్తుంది.
అఖండజ్యోతి 1949 సెప్టెంబర్ 31వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ