జీవితంలోని చాలా సందర్భాలలో గొప్ప విపత్కర పరిస్థితులు ఎదురౌతాయి. వాటి దెబ్బ సహించలేక మనిషి వ్యాకులత చెంది తన చేతగానితనానికి ఏడుస్తూ కేకలేస్తుంటాడు. ప్రియమైన మరియు అప్రియమైన సంఘటనలు సంభవిస్తాయి. సంభవిస్తూనే ఉంటాయి.
అటువంటి సందర్భాలలో మనము వివేకంతో వ్యవహరించాలి. జ్ఞానం ద్వారానే మనము జీవితంలోని ఆ అప్రియమైన సంఘటనల దుష్పరిణామాల నుంచి తప్పించుకొనగలము. భగవంతుని కరుణపై విశ్వాసముంచుట ఇటువంటి సందర్భాలలో ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. మన జ్ఞానం చాలా అల్పం కనుక భగవంతుని లీలలను మనం తెలుసుకొనలేము. ఏ సంఘటనలను ఈ రోజు మనము మనకు అప్రియమైనవని అనుకుంటామో అవి నిజానికి మనకు మేలునే కలుగ చేస్తాయి.
మన మందబుద్ధి మరియు అసంపూర్ణ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని పరిస్థితులు అసలు కారణం తెలుసుకోలేకపోయినా కాని అందులో ఏదో కొంత మన మేలు దాగి ఉంటుందని మనము అర్ధం చేసుకోలేక పోవచ్చు. కష్టకాలంలో మనం భగవంతుని న్యాయపరాయణత మరియు కరుణ పై అత్యధికమైన విశ్వాసం ఉంచాలి. దాని వలన మనం భయపడకుండా ఆ ఆపద తప్పిపోయేంత వరకు ఓర్పుతో ఉండగలము. సంతోషంగా ఉండటానికి శాస్త్రీయమైన సలహా ఇటువంటి సమయాలలోనే పనికొస్తుంది. కర్తవ్య నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా, సంతోషం కాదు వచ్చిన పరిస్థితులకు విచలితులు కాకుండా ఉండుటయే సంతోషం. సంతోషంగా ఉండటం ద్వారానే కఠిన ప్రసంగాల భారం సగం తేలికవుతుంది.
37
అఖండజ్యోతి 1943 ఏప్రిల్ 88వ పేజీ https://chat.whatsapp.com/LYfpk5836TQERzAv5kcUxs