Home year2023 కట్టెలు కొట్టేవాని కథ

కట్టెలు కొట్టేవాని కథ

by Akhand Jyoti Magazine

Loading



ఒక కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు. ఒకరోజు అతడు ఒక చెట్టు క్రింద నిద్రపోతున్నాడు. అనుకోని రీతిలో (ఊహించని విధంగా) అతడి గొడ్డలిపోయింది. పోయిన గొడ్డలి కోసం అతడు ఏడవటం మొదలుపెట్టాడు. ఆ చెట్టు మీద ఒక రాక్షసుడు ఉండేవాడు. కట్టెలు కొట్టే వ్యక్తి దుఃఖాన్ని చూడలేక అతడు క్రిందకు దిగివచ్చి అతడి ఏడుపుకు కారణం అడిగాడు. తన గొడ్డలి పోయిందని చెప్పగా, “అదేమైనా గొప్ప వస్తువా? చెప్పు నీ గొడ్డలి ఇనుపదేనా?” అని అడిగాడు. “ఇనుపదే కానీ అదే నా జీవితానికి గొప్ప” అన్నాడు అతడు.

“సరే అయితే తీసుకో” అంటూ ఆ రాక్షసుడు ఒక బంగారు గొడ్డలీ, ఒక వెండి గొడ్డలీ సృష్టించి ఇచ్చాడు. “అయ్యా! నా నియమాన్ని చెడగొట్టకండి, నాకు వెండి, బంగారాల మీద వ్యామోహం లేదు. నాకు నా ఇనుపగొడ్డలిని ఇప్పించండి. అదే నాకు జీవనాధారం. దానిని నేను ప్రాణంకన్నా ఎక్కువగా చూసుకుంటాను. దానివల్లనే నాకు శాంతి, సంతోషమూ లభిస్తాయి” అన్నాడు కట్టెలు కొట్టేవాడు. చివరకు రాక్షసుడు అతనికి ఇనుపగొడ్డలిని తెప్పించి ఇచ్చాడు. అతడు లోభాన్ని, దురాశనూ జయించిన వ్యక్తి!

ఇలాంటిదే ఒక కథ మహాభారతంలో ఉన్నది. ఒకసారి పాండవులు బ్రాహ్మణులందరినీ విందు భోజనానికి ఆహ్వానిం చారు. సదాచారసంపన్నుడైన ఒక బ్రాహ్మణుడు కేవలం తన కష్టార్జితంతో సంపాదించుకున్న ఆహారాన్ని మాత్రమే తింటూవుండేవాడు. పాండవుల ఆహ్వానాన్ని అందుకున్న అతడు ఏడవటం ప్రారంభించాడు.

భోజనాలు పూర్తవుతుండగా ధర్మరాజు, అర్జునుడు, శ్రీకృష్ణుడు ముగ్గురూ కూడా “మనం ఆహ్వానించిన అతిథులందరూ వచ్చి భోజనం చేశారు. ఐతే ఒక్క బ్రాహ్మణుడు మాత్రం రాలేదు” అని అతడికి కబురు చేశారు. బ్రాహ్మణుడు రావడమైతే వచ్చాడు. కానీ వెక్కివెక్కి ఏడ్వటం ప్రారంభించాడు. వారందరూ అతని రోదనకు కారణం అడిగారు. “మిమ్మల్ని సరిగ్గా ఆహ్వానించలేదా లేక ఏమైనా అమర్యాద జరిగిందా?” అని పదేపదే అడుగగా… అతడు “తమరు మహారాజులు. నేనా ఒక సామాన్య బ్రాహ్మణుడిని. మీరు చెప్పిన మాట విని ఇక్కడకు రాకపోతే మీ ఆజ్ఞను అనగా రాజాహ్వానాన్ని ధిక్కరించి చెడ్డవాడిని అవుతాను. కానీ ఇక్కడ మీ ఆజ్ఞను పాటించి భోజనం చేస్తే నా జీవాత్మ అంగీకరించదు. ఎందుకంటే అది కష్టం చేసి సంపాదించుకున్న ఆహారం కాదు కాబట్టి. తద్వారా అప్పుడూ నేను చెడ్డవాడినే అవుతాను. ఏమి చెయ్యాలో అర్థం కాక రోదిస్తున్నాను. దయచేసి తమరు క్షమించి ఇంటికి వెళ్ళటానికి నాకు అనుమతి నివ్వండి”. అన్నాడు.
*యుగ శక్తీ గాయత్రి 2023 జూలై*
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ

You may also like