వివిధ రకాలైన మత, మతాంతరాల, సంప్రదాయాల చిక్కుముడులతో నిండిన కర్మకాండల జంజాటంలో పడి తిరుగుతూ ఉంటే ధర్మతత్వం బోధపడదు. ధర్మాన్ని పొందాలనుకునేవారు, నిజముగా ధర్మాత్ములు కావాలనుకున్న వారు తమ ఇచ్ఛ, కోరిక మరియు అలవాట్ల గురించి గట్టిగా పరిశీలించి వీటిలో ఇతరుల హక్కులను ఆటంకపరిచే అంశాలు ఉన్నాయేమో చూడాలి. నీ స్వార్థపరత్వం, లోభత్వం, కూడబెట్టేతత్వం మరియు భోగేచ్ఛలను తగ్గించుకొని, దయ, ఉదారత, పరమార్థం, ప్రేమ, సేవ, సహాయం, త్యాగం, వంటి సాత్విక ప్రవృత్తులు పెంచుకోవాలి. స్వార్థం ఎంత తొలగించబడుతుందో, పరమార్ధం ఎంత పెరుగుతుందో మనిషి అంత ధర్మాత్ముడు, పుణ్యాత్ముడుగా తయారౌతాడు. ఇదే మార్గంలో వెళ్తూ పురుషుడు స్వర్గం లేక ముక్తిని పొందగలడు.
మనుషులు తమ కొరకు ఏమి ఆశిస్తారో అదే విధంగా ఇతరులతో వ్యవహరించక పోవటమే ప్రపంచంలోని అన్ని దుఃఖాలు, క్లేశాలు, సంఘర్షణలకు ఏకైక కారణం. కొనుటకు ఒకరకపు తూకపు రాళ్ళను వాడితే అమ్ముటకు వేరోకటి. ఈ హానికరమైన నీతే అశాంతికి మూలం. స్వార్ధం అనే నికృష్ట కోరికతో అంధులమై మన ఎడల మంచి వ్యవహారం కోరుతూ ఇతరుల ఎడల చెడుగా వ్యవహారం జరుపుతుంటే దాని కచ్చితమైన పరిణామం కలహమే అవుతుంది. మనుష్యులకు సహజంగా ఏ వ్యవహారం ఇష్టం ఉండదో అది పాపం. ఈ పాప కర్మలను ఆచరించే వాడు పాపి.
*అఖండజ్యోతి 1944 మార్చి 63వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ