నిశ్చయంగా ప్రేమ మరియు ఆనందం యొక్క స్రోతస్సు ఆత్మ లోపల ఉన్నది. దానిని భగవంతునితో సంధానం చేస్తేనే అపరిమితం మరియు స్థిరమైన ఆనందం లభిస్తుంది. ప్రాపంచికమైన, నశ్వరమైన వస్తువుల భుజం పై ఆత్మీయత అనే భారాన్ని వేస్తే ఆ వస్తువులలో మార్పు కలిగినపుడు లేక అవి నశించిపోయినపుడు కాని ఆధారం పగిలిపోయి మనం దాని భుజం పై ఏ భారాన్ని ఉంచామో అది తటాలున క్రింద పడిపోతుంది, ఫలితంగా పెద్ద దెబ్బ తగిలి మనం చాలా సేపటి వరకు కళ్ళుమిరిమిట్లు కొలిపే స్థితిలో ఉంటాము. ధనం పోయినపుడు, ఆత్మీయులు పోయినపుడు, అపకీర్తి కలిగినపుడు ఎంతో మంది కేకలు పెట్టి ఏడ్చి జీవితాలను నాశనం చేసుకుంటారో చూస్తూ ఉంటాము. ఇసుకలో మేడలు నిర్మించి అవి అజరామరం కావాలని కలలు కనేవాళ్ల దుర్దశ ఎలా ఉంటుందో అదే ఇలా హాహాకారాలు చేసే ప్రేమికులది కూడా. భౌతిక పదార్థాలు నశించేవే, అందువలన వాటి పై ప్రేమ పెంచుకోవడం ఒక అసంపూర్ణమైన, కుంటిదైన పనికిరాని ఆధారమవుతుంది, అది ఎపుడైనా విరిగిపడి పోవచ్చు, పడి పోయినపుడు దానిని ప్రేమించే వానికి హృదయ విదారకమైన దెబ్బ తగులుతుంది. ప్రేమ యొక్క గుణం ఆనందమయం.
ప్రేమ యొక్క ఆధ్యాత్మిక స్వరూపమేమంటే ఆత్మకు ఆధారంగా పరమాత్మను తయారు చేయడం. చైతన్యవంతం మరియు అజరామరమైన ఆత్మ యొక్క ఆధారం సచ్చిదానందుడైన పరమాత్మ మాత్రమే కాగలుగుతాడు. ఇందువలన జడపదార్థాలు, భౌతిక వస్తువుల నుంచి చిత్తాన్ని మళ్లించి భగవంతుని వైపు మరలు.
55
అఖండజ్యోతి 1945 జూలై 148వ పేజీ https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ