భగవంతుని వెదుకుటకు, ఆయనను పొందుటకు మనం చాలా రకాల ప్రయత్నాలు చేస్తాం కాని పొందలేము. ఆయన సర్వత్రా ఉన్నాడు, అన్నిచోట్ల ఉన్నాడు అంటారు కాని మనకు ఆయన ఎందుకు కనపడుట లేదూ? ఆయనను పొందటానికి ధనం, వైభవం, మరియు జీవితమైనా కూడా నశింప చేసుకుంటారు కాని పొందలేరు. చివరకు నిరాశ చెంది భగవంతుడే లేడంటారు.
సోదరా! భగవంతుడున్నాడు కాని ఆయనను వెతుకుటలో పొరపాటు చేస్తున్నావు. నీవు ఆయనను ధనం, వైభవంతో పొందలేవు. ఆయనను పొందాలంటే ప్రేమించటం నేర్చుకో. ప్రాణులను ప్రేమించు, జడ-చైతన్యాలను ప్రేమించు, ఆత్మను ప్రేమించు. ఆయనను పొందటానికి ఆడవులకు వెళ్లాల్సిన అవసరం లేదు, ధుని రగిలించాల్సిన అవసరం కాని, ధనం, వైభవం నష్టపోవలసిన అవసరము లేదు. ఆయన సర్వత్రా ఉంటే మీ దగ్గర కూడా ఉండాలి. ఉండాలి కాదు, ఉన్నాడు. ఎక్కడ? మీ శరీరంలో, దానినే మీరు ఆత్మ అంటారు. మీరెప్పుడైనా మీ ఆత్మ యొక్క పిలుపు పైన దృష్టి పెట్టారా? లేదు. ఆయనను వెతికినా కూడ కనపడకపోవటానికి కారణ మిదే. ఆలోచించు, నువు మాట్లాడేటపుడు, నడిచేటపుడు, పని చేసేటపుడు, ఆలోచించేటపుడు లేక మంచి పని చేయటానికి ప్రేరణ కలిగినపుడు, అది ఎక్కడ నుంచి, ఎవరు చేస్తారు, లేక ఎవరు చెప్తారు? నీవెప్పుడైన ఎవరికైనా కష్టం కలిగించాలని ఆలోచించినపుడు లోపలి నుంచి ఎవరైనా నిన్ను అలా చేయవద్దని ఆపుతారా, అతను ఎవరు? అది నీలో ఉన్న భగవంతుడే. ఆయనను నీలోనే నీవు పొందవచ్చును.
అఖండజ్యోతి 1944 ఏప్రిల్ 82వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ