ఏ క్షణం అయితే మనం భగవంతునితో ఏకత్వం అనుభవించటం ప్రారంభం చేస్తామో అదే క్షణం మన హృదయంలో శాంతి యొక్క స్రోతస్సు ప్రవహించటం ప్రారంభిస్తుంది. మనలను మనం ఎల్లపుడూ సుందరమైన, ఆరోగ్యకరమైన, పవిత్రమైన మరియు ఆధ్యాత్మిక ఆలోచనలతో కలగలిపి ఉండుట, నిజానికి అదే జీవితం మరియు శాంతిని పొందే మార్గం. “నేను ఆత్మను, భగవంతుని అంశను” అనే సత్యాన్ని ఎల్లపుడూ మన హృదయపటలం మీద చెక్కాలి మరియు ఎల్లపుడూ అదే ఆలోచనా పరంపరను కలిగి యుండుటయే శాంతి యొక్క మూలతత్వం. వేలమంది వ్యక్తులు ఈ ప్రపంచంలో చింతలతో, దుఃఖాలతో శాంతి కొరకు ఎక్కడెక్కడో తిరుగుతూ ఇంకా విదేశాలను పట్టి జలిస్తూ ఉండటం ఎంతో కరుణాజనకం మరియు ఆశ్చర్యం కలిగించే దృశ్యం, కాని వారికి శాంతి దర్శనం మాత్రం దొరకదు. ఇందులో నువ్వు గింజంత సందేహం కూడా లేదు. ఎందువలననగా ఈ విధంగా వారు సంవత్సరాల తరబడి వెదికినా ఎప్పుడూ శాంతిని పొందలేదు. కారణమేమంటే వారు శాంతి లేని చోట శాంతి కొరకు వెదకుచున్నారు. ఆ అమాయక మనుష్యులు బాహ్య వస్తువుల పై తృష్ణ నిండిన చూపులతో చూస్తున్నారు, కాని శాంతి అనే ప్రవాహం వారిలోనే ప్రవహిస్తున్నది. కస్తూరి, మృగం యొక్క నాభిలోనే ఉన్నది. కాని ఆ మృగం అజ్ఞానంతో దాని కొరకు వెతుకుతూ తిరుగుతుంది. జీవితంలో నిజమైన శాంతి తన లోపలికి తొంగి చూస్తేనే దొరుకుతుంది.
మన మనసు పై నియంత్రణ కలిగి ఉండుటయే పరిపూర్ణ శాంతిని పొందుటకు ఆవశ్యకం. మనం మనసు, ఇంద్రియాలకు దాసులం కాకుండా వాటి పై ఆధిపత్యం కలిగి ఉండాలి.
76
అఖండజ్యోతి 1947 మార్చి 2వ పేజీ
https://chat.whatsapp.com/CZpyqT4jliH8GyZbDkRnjQ