మనం తరచుగా శారీరిక మరియు మానసిక సుఖముల కొరకు వెతుకుతూ తిరుగుతూ ఉంటాము. కాని అన్నిటికంటే ఉత్తమమైన ఆధ్యాత్మిక సుఖం గురించి ఆలోచించము. మనం చేసే పనులన్నిటిలో సుఖాన్ని పొందాలనే కోరిక దాగి ఉంటుంది. స్థూలదృష్టి కలిగిన మనుషులము మనం బాహ్య వస్తువులలో సుఖాన్ని పొందాలనే కోరిక కలిగి ఉంటారు. బాహ్య వస్తువులు సుఖాన్ని ఇవ్వగలవా? ఈ జగత్తులో మనకు సుఖాన్ని ఇచ్చేవి బైట లేవు అవి లోపలే ఉన్నవి, అనగా సుఖం కొరకు బైట వెతుకుట వృధా! హిందూ శాస్త్రాలు ప్రమాణీకరించిన దేమంటే మనసు యొక్క తత్వ నిర్ణయం జరుపకుండా బాహ్య జగత్తు యొక్క సుఖాలకు ఆశపడగూడదు. ఇందువలన మనసు యొక్క తత్వాని తెలుసుకొని దాని మీద పూర్తి అధికారం కలిగి ఉండటం అత్యంత అవశ్యకమైనది. మనసును జయించటం ద్వారానే ప్రపంచాన్ని జయించవచ్చు.
మనుష్యుని సుఖం మరియు ఆనందాల గని లోపల ఉన్నది. దాని మెరుపు బైట కూడా కనపడ్తుంది. కాని అది ఒక మెరుపు మాత్రమే. శాస్త్రాలలో చెప్పినది నిజం ఏదైన సత్యవస్తువు, బ్రహ్మ లేక పరమాత్మ రూపం తెలుసుకోవాలంటే ముందు మనం చిత్తాన్ని కొద్ది సేపు స్థిరంగా ఉ ౦చుకోవాలి. దీనినే సాధన ధర్మంలోని ఒక భాగం అంటారు. ఇందువలన శాశ్వత సుఖాన్ని పొందటానికి మనం ధర్మం యొక్క ఆశ్రయాన్ని పొందాలి. ధర్మమే మనకు వర్తమానంలోని క్షణిక సుఖాలకు బదులు భవిష్యత్తులో లభించే అక్షయ సుఖానికి మార్గాన్ని చూపిస్తుంది.
అఖండజ్యోతి 1942 సెప్టెంబర్ 18వ పేజీ
https://chat.whatsapp.com/LYfpk5836TQERzAv5kcUxs