ప్రకృతి యొక్క సునిశ్చిత నియమేమిటంటే సమానమైన వస్తువులు ఆకర్షించబడతాయి. అధిక ధనము మిగతా ధనముని తన వైపు కి లాక్కుంటు ఉంటుంది. అధిక జలసంపద కల సముద్రం అన్ని నదుల యొక్క జలాన్ని తనలోకి ఆకర్షించి తనలో కలుపుకొంటుంది. అలాగే మన యొక్క ఆలోచనలు ఏ ప్రకారము గా వుంటాయో అటువంటి ఆలోచనలే మనలను చుట్టుముడుతాయి.
ఆలోచనల కు ఆకట్టుకునే శక్తి ఉంటుంది. మానవుడు ఒక శక్తి వంతమైన యంత్రము. అది మిమ్మల్ని ఈ అదృశ్య జగత్తు నుండి ఏ ఆకర్షణ కు లొంగుతారో దానిని ప్రేరేపిస్తుంది. మీరు దేనికైతే ఆకర్షణ చెందుతారో అటువంటి ఆలోచనలు చింతన చేస్తే మీరు నిశ్చితంగా దానిని పొందుతారు. నిర్ణయాత్మక ఆలోచనల పై ప్రగాఢ విశ్వాసం వాటి సఫలత కు కచ్చితంగా దారి తీస్తాయిమనం చేసే ఆలోచనల వ్రభావంమనపైన, ఇతరులపైన పడుతుంది. ప్రశాంతమైన ఆలోచనలు మన మనస్సును నెమ్మది నెమ్మదిగా మార్చివేస్తాయి. మనం మనకి ఇష్టమైన పనులను ఆడుతూ పాడుతూ చేస్తుంటాము. ఇష్టం లేని పనులు ముఖ్యమైనవయినా చేయాలనిపించదు. కానీ మన స్వభావం మార్చుకోవడం మన చేతుల్లోనే ఉన్నది. ఇది ప్రశాంతమైన ఆలోచనల ద్వారా సాధ్యమవుతుంది. స్వభావం మార్చుకోవడం వల్ల ఎటువంటి పనులైనా మనిషి సునాయాసంగా చేయగలుగుతాడు.
మనిషికి ఇష్టంలేకపోయినా తప్పనిసరి పరిస్థితులో కొన్ని పనులు చేయవలసి వచ్చినపుడు పలురకాలైన ఆటంకాలు వస్తుంటాయి. మనిషి తను చేసిన తప్పుల గురించి, పనులు ఎందుకు కావడం లేదో అనే దాన్ని గురించి ప్రశాంతంగా విశ్లేషిస్తే దానికి అసలు కారణం తనలోనే ఉందని గుర్తిస్తాడు. టెన్షన్ లేకుండా చేసిన పనుల వల్ల ఆత్మ విశ్వాసం పెరుగుతుంది, సాఫల్యం తప్పక లభిస్తుంది. ఇలా చేయడం వల్ల ఇంద్రియాలు సవ్యంగా పనిచేస్తాయి. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. కోరికలు పెంచుకుంటూ పోతుంటే ప్రశాంతత మాయమవుతుంది. మనిషిలో కోరికలు ఎంత ఎక్కువగా ఉంటే వాటితో పాటు భయం, సందేహం, మోహం అంత ఎక్కువగా ఉంటాయి.
అఖండజ్యోతి, మే 1955
అనువాదం : శ్రీ ఊటుకూరి సత్యన్నారాయణ గుప్త
credit : storyset