ఒకసారి దేవర్షి నారదుడు తన తండ్రి అయిన బ్రహ్మతో తమరు ఎంతో పూజ్యవరులు, ఈ లోకానికి పరబ్రహ్మ స్వరూపులు. దేవతలూ- దానవులూ ఇరువురూ ఓ సంతానమే కదా! భక్తి మరియు జ్ఞానమునకు దేవతలు శ్రేష్ఠులు. అయితే శక్తికి మరియు తపస్సుప (సాధన)లందు దానవులు శ్రేష్టులే కదా! మీరు దానవులకు పాతాళాల్నీ మరియు దేవతలకు స్వర్గంతో స్థానం కల్పించారు. అలా ఎందుకు చేసారు? దేవతలు, దానవుల కంటే గొప్పవారా! అని
ప్రశ్నించెను. అపుడు బ్రహ్మ నారదునితో – ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వడం చాలా తేలిక. నీవు దానవులను మరియు దేవతలను ఇరువురినీ భోజనమునకు ఆహ్వానించు, నీ ప్రశ్నకు సమాధానము లభించునని చెప్పెను. నారదుని ఆహ్వానాన్ని మన్నించి దానవులు మొట్టమొదటగా స్వర్గమునకు చేరిరి. భోజనమును వారికి ముందుగా వడ్డించిరి. దానవులు భోజనం చేయటం ఆరంభించే సమ యంలో బ్రహ్మవారితో – భోజనం అందరికీ వడ్డించబడుతుంది. కానీ మీరు మోచేయి ముడవకురా భోజనమును స్వీకరించండి’ అని అనెను. అపుడు దానవులు అసందిగ్ధంతో పడిపోయిరి, వారు ఎన్నో విధములుగా, ఎంతో ప్రయత్నించినా వారికి సాధ్యం కాలేదు. వారి ప్రయత్నమూ లేవీ ఫలించలేదు. తినకుండగనే వారు అక్కడ నుండి వెడలిపోయింది. తరువాత దేవతలు అరుదెంచిరి. బ్రహ్మవారితో కూడా ఈ విధంగానే వచించెను. దేవతలు వెంటనే వారందరూ కలిసి ఒకరికొకరు తినిపించుకొనిరి. వారందరూ తృప్తిగా భోంచేసి అక్కడ నుండి వెడలిపోయిరి. నారదుడి ప్రశ్నకు సమాధానము లభించెను. ఒకరికొకరుగా కలిసిపోవుట వలననే వారు దేవతలయ్యిం. అందుకనే దానవుల కంటే వారు శ్రేష్టులయ్యిి. అందరూ కలిసి-మెలిసి ఉండటము. దైవత్వమునకు మార్గమని నారదునికి అర్థమయ్యెను.