“మహాపురుషులు పరహితార్థమే జన్మనెత్తుతూ వుంటారు”. వారికి సొంతానికంటూ ఏ అవసరాలు ఉండవు. 19వ శతాబ్దపు చివరి సమయంలో రాకూర్ దాస్ అనే వయోవృద్ధుడు భార్యాబిడ్డలతో కలకత్తాలో నివసించేవాడు. కుటుంబ సభ్యులు ముగ్గురే అయినా పోషణ సక్రమంగా సాగక ఆర్థిక పరిస్థితులు వారిని మేదినీపురం జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి లాక్కొచ్చి పడవేశాయి. అక్కడ ఠాకూర్ దాసనకు రూ. 2/- నెలసరి వేతనానికి ఉద్యోగం లభించింది. కాలాంతరంలో ఆయన కూడా మరణించటంతో, కుటుంబభారాన్ని భార్య మోస్తూ అనేక సంవత్సరాలు గడిపింది.
ఒక రాత్రి కొడుకు తల్లితో “అమ్మా! బాగా చదువుకొని గొప్పవాడినై నిన్ను సుఖపెట్టాలని వుందని” తన కోర్కెను తెలియజేశాడు. నన్ను ఎలా సేవించి సుఖ పెడతనని ప్రశ్నించింది తల్లి. మంచి మంచి పదార్థాలు తినిపించి ఖరీదైన బట్టలు, విలువైన నగలువేయించి, సుఖపెడతానన్నాడు కొడుకు. ‘సరే! సంతోషమే ! కానీ నేను కోరిన నగలే చేయించాలని అన్నది తల్లి. అవేమిటో తెలియచెప్పమన్నాడు. కేవలం మూడు ఆభరణాలు చాలునని, వాటిలో మొదటిది ఈ గ్రామంలో అవిద్యను దూరం చేయటానికి ఒక విద్యాలయాన్ని నిర్మించమని, అనారోగ్యాన్ని నిర్మూలించటానికి ఒక వైద్యాలయాన్ని నిర్మించమని, నీ వంటి పేదపిల్లల వసతికి, భోజనానికి కావలసిన సౌకర్యాన్ని కల్పించమని తల్లి కుమారుడిని కోరింది.
తినటానికి కడుపు నిండా తిండి కూడా ఏనాడూ నోచుకోని కన్నతల్లి తన కోసం ఏమీ కోరక, కొడుకు వైభవాన్ని సమాజ కళ్యాణానికి ధారపోస్తూ పలికిన ఆ పలుకులకు భావవిభోరుడైన కుమారుడు ఆనాటి నుండి తల్లి కోరిక 3 ఆభరణాలు ఎంత త్వరగా చేయిస్తానా అనే తపనతో కఠోర పరిశ్రమను ప్రారంభించాడు. ఆదర్శం గొప్పది అయినపుడు దైవకృపకు లోటుండదు కాబట్టి అనుకొన్నట్లే ఆమె కుమారుడు గొప్పవాడై ఉన్నతపదవిని చేపట్టి తల్లి కోర్కెలను తీర్చి మాతృఋణం నుండి ముక్తిని సంపాదించాడు. అంతేగాక స్త్రీ శిక్షణ, మంగళసూత్రం అవసరంలో నున్నవారందరికీ కన్నతల్లి చిహ్నంతో మంగళసూత్రాలను అందజేయటం మొదలైన అనేక గొప్ప కార్యక్రమాలు నిర్వర్తించాడు. ఈ మహానుభావుడు ఎవరోకాదు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
Source: *యుగ శక్తి గాయత్రి పత్రిక డిసెంబర్ 2018*For More readings..!https://www.swadhyay.awgp.org/For hard copy magazine subscription http://ow.ly/eBHl30rFkMg