ఒక శిష్యుడు తన గురువును ఆత్మసాక్షాత్కార మార్గం చెప్పమని అడిగాడు. అది చాలా కఠినమైన మార్గం, అతి | కష్టసాధ్యమైన క్రియలెన్నో చెయ్యాలి. నువ్వు అంత కఠినమైన సాధన చెయ్యలేవు అని నచ్చజెప్పినా వినకపోవడంతో, సరే ఒక సంవత్సరం పాటు గాయత్రి మంత్ర నిష్కామ జపం చేసి చివరి రోజు రమ్మని ఆదేశించాడు. శిష్యుడు అదే చేశాడు. సంవత్సరం పూర్తయ్యే రోజున గురువు ఇల్లు ఊడ్చే ఆమెను పిలిచి ఫలానా శిష్యుడు వస్తాడు. అతడు రాగానే | దుమ్మంతా ఊడ్చి అతనిమీద వెయ్యి అని ఆదేశించాడు. ఆమె అలాగే చేసింది. సాధకుడు కోపంతో ఊగిపోతూ ఆమెను
కొట్టడానికి వెంటబడ్డాడు. ఆమె పారిపోయింది. శిష్యుడు మరల స్నానం చేసి గురుసేవకు వచ్చాడు. గురువు అతనిని చూసి నవ్వు ఇప్పటికీ కాటువేసే పాములాగా పరిగెడుతున్నావు. ఇంకో సంవత్సరం సాధన చేసిరా అని ఆదేశించాడు. శిష్యునిలో కోపం తన్నుకొస్తూ ఉంది. అయినా ఎలాగైనా సరే ఆత్మదర్శనం చేసుకోవాలనే తపన ఉండడంతో తమాయించు కొని మరల సాధనకు వెళ్ళాడు.
రెండవ సంవత్సరం చివరి రోజున గురువు ఆమెను పిలిచి అతనికి చీపురు తాకించమని ఆదేశించాడు. అతను రాగానే ఆమె అలాగే చేసింది. అయితే ఈసారి కేవలం తిట్టి పంపించేసి మరల స్నానం చేసి గురువు వద్దకు వెళ్ళాడు.
ఇప్పుడు నువ్వు కాటువేయడానికి పరిగెత్తవుగాని బుసలు కొడుతుంటావు. కనుక ఇంకో సంవత్సరం సాధన చేసిరా అని | ఆదేశించాడు.
మూడవ సంవత్సరం పూర్తయిన రోజున గురువు మరల ఆమెను పిలిచి చెత్త బుట్టను అతని మీద కుమ్మరించమని | చెప్పాడు. ఆమె అలా చేసినా శిష్యునికి కోపం రాలేదు. అంతేకాక చేతులు జోడించి ‘తల్లీ! నీవు ధన్యురాలివి. మూడు సంవత్సరాల నుండి నాలోని దోషాలను తొలగించడానికి పూర్తి తత్పరతతో కృషి చేస్తున్నావు అని చెప్పి మరల స్నానం చేసి గురుసేవకు వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు.
Click Below link to read Magazine
Source: Yug Shakti Gaytri Dec 2021