Home Life Managment సాధన యొక్క పరమ లక్ష్యము చిత్తశుద్ధి

సాధన యొక్క పరమ లక్ష్యము చిత్తశుద్ధి

by

Loading

ఒక వ్యక్తి నది ఒడ్డున ఒక కుటీరము నిర్మించుకొని నివసించుచుండెను. అక్కడే ఉంటూ నియమిత రూపంలో జపతాపాలు ఆచరించుచుండెను. ఏళ్ళ తరబడి సాధన చేయుట వలన అతనికి కొన్ని సిద్ధులు ప్రాప్తించినవి మరియు తన సిద్ధులను అతడు పలు విధములైన చమత్కారములను ప్రదర్శించుటకు ఉపయోగించుచుండెను. చూస్తుండగానే వేలకొలది మంది అతనికి అనుచరులుగా మరియు ప్రశంసకు లుగా మారిపోయారు. ఇప్పుడిక ఆ వ్యక్తి ఒక సాధువుగా ఖ్యాతిని గడించెను. కాని అతనికి తన సిద్ధుల పట్ల చాలా అహంకారము కలదు. తన అనుచరుల మరియు ప్రశంసకుల సంఖ్య పెరుగుట చేత అతని అహంకారము కూడా పెరిగెను. ధనవంతుల నుంచి అతనికి బహుమానాలు లభించుచుండెను. కావున ధనవంతుల పట్ల అతని ప్రవర్తన మధురముగా ఉ ండెను. కాని సాధారణ శిష్యులు, పేదలను కలవటానికి అతనికి ఎటువంటి ఇష్టము లేకుండెను.

అతను కొన్నేండ్లకు వృద్ధుడయ్యెను. తన మృత్యువుని గురించిన చింతన అతనిని భయానికి గురిచేయుచుండెను. ఎప్పుడైన మరణించిన వ్యక్తిని చూసినట్లయితే అతనిని మరణ భయం వెంటాడుచుండెను. ఒకసారి మృత్యువుని గురించి ఆలోచిస్తూ అతను గాఢనిద్రలోకి వెళ్ళెను. అతనికి ఒక కల వచ్చెను. ఆ కలలో అతను చనిపోయినట్లుగా ఆతని ఆత్మను యమ దూతలు యమ లోకానికి తీసుకువెళ్ళుచుండెను. యమలోకానికి చేరగానే అక్కడ ఆశీనులయిన యమధర్మరాజు కన్పించెను. యమధర్మరాజు అతని పాపపుణ్యాల చిట్టా తెరిచి అతనికర్మానుసారం సద్గతిని లేక అధోగతిని నిర్ణయించి ప్రకటిస్తున్నట్టుగా తలచెను. అది దైవలీలలో ఏమోకాని ఒక బందిపోటు కూడా మరణించి ఆ సమయానికి యమలోకానికి చేరెను.

యమధర్మరాజు ఇద్దరి సత్ కర్మలను, పాపకర్మలను విచారించి తన నిర్ణయాన్ని ప్రకటించబోయినప్పుడు ధర్మరాజు ఆ ఇద్దరితో ఈ విధంగా అనెను. “నేను నా నిర్ణయాన్ని ప్రకటించుటకు ముందు మీ ఇద్దరూ తమ తమ కర్మలను గురించి మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తున్నాను. బందిపోటు ఎల్లప్పుడూ హింసాత్మాక, మరియు చెడు కర్మలనే చేసెను. కావున ప్రవర్తన అత్యంత పశ్చాత్తాపముతో ఉండెను. అతను ఈ విధంగా ఆలోచించుచుండెను. నేను ఎన్నో కుకర్మలు చేసితిని. ఎందరినో పీడించాను. దుఃఖాన్ని కలిగించాను.

మీరెందరినో హత్య చేశాను. ఇలా ఆలోచిస్తున్నప్పుడు అతని కళ్ళలో కన్నీరు నిండెను. అతను ఎంతో వినయంగా యమ ధర్మరాజుతో చెప్పెను. “ఓ ధర్మరాజు నేను జీవన పర్యంతం పాపకర్మలనే చేసితిని కనుక నేను సద్గతిని పొందుటకు ఎలా ఆశించగలను. కావున తమరు ఏ విధమైన దండన విధించినా నేను స్వీకరించుటకు సిద్ధంగా ఉన్నాను” ఇప్పుడు సాధువు వంతు వచ్చెను.

సాధువు ఈ విధంగా చెప్పెను. “ఓ ధర్మరాజా నేను నా జీవన పర్యంతం జప తపాలే ఆచరించాను. నేను నిత్యం అగ్నిహోత్రం కూడా చేశాను. నేను ఎన్నో ధర్మ గ్రంథాలను కూడా అధ్యయనం చేశాను. కావున వీటి ఆధారంగా నేను నా కొరకు స్వర్గము, ముక్తి, సద్గతి మొదలైనవి ఆశించుట సబబే కదా! కావున తమరు నా కొరకు స్వర్గంలోని సుఖ సాధనలను శీఘ్రంగా ఏర్పాటు చేయగలరు.” ధర్మరాజు ఇద్దరి మాటలను విని మొదట బందిపోటుతో ఇట్లనెను. “నీవు నేటి నుంచి ఈ సాధువుకు సేవచేయవలెను. ఇదియే నీకు విధించే దండన.” – ధర్మరాజు ఆజ్ఞను ఆ బందిపోటు తలవంచి స్వీకరించెను. కాని ధర్మరాజు యొక్క ఆజ్ఞని వినిన తర్వాత ఆ సాధువు తన అభ్యంతరాన్ని ఈ విధంగా వివరించెను. మహారాజా ఈ పాపి స్పర్శతో నేను అపవిత్రుడనవుతాను. అప్పుడు ఇక నేను ఆచరించిన భక్తి తపస్సులకి ఏం విలువ మిగులుతుంది. ఒక పుణ్యకర్మలని ఆచరించిన నాకు ఏ విధమైన ప్రత్యేకత ఉండదు కదా!

సాధువు యొక్క మాటలు ధర్మరాజుని బాధకు గురి చేసెను. అప్పుడు ధర్మరాజు చెప్పెను. “నీవు ఎవరినైతే బందిపోటు అంటున్నావో, అతనికి తన తప్పు ఏమిటో తెలిసింది. అలాగే పశ్చాత్తాపం కలిగింది. కాని నీకు నీ తప్పేమిటో తెలిసిందా! జీవన పర్యంతము తపము తపమని ఆడంబరాన్ని ప్రదర్శించావే కాని ఎప్పుడైనా జప-తపాలు

నీ చిత్తశుద్ధికి సాధనాలని తెలుసుకోగలిగావా? నీవు సిద్ధులని, చమత్కారాలని, వాటినే సాధనాలని తెలుసుకోగలిగావా? నీవు సిద్ధులని, చమత్కారాలని, వాటినే సాధనాలని సర్వస్వంగా భావించావు. జపతపాలు చిత్తశుద్ధికి సాధనాలు మరియు చిత్తశుద్ధి ఉంటేనే సాధకునికి మోక్షము, ముక్తి, ఇష్టదైవ దర్శనం మొదలైన సిద్ధులు ప్రాప్తిస్తాయి.

ధర్మరాజు మరల ఈ విధంగా అంటూ ఉన్నారు. “నీవు నీ జీవన పర్యంతం అహంకారం ప్రదర్శిస్తూనే ఉన్నావు. నీవు ధనవంతులకే నీ ఆశ్రమంలో ఆశ్రయమిచ్చావు. దరిద్ర నారాయణుల కొరకు నీవు ఏమీ ఆలోచించలేదు. కావున నీ తపస్సు మొత్తం నిష్ఫలం అయినది. అందువలన నీవు సంవత్సరాల తరబడి తపస్సు ఆచరించినా అహంకారగ్రస్తుడి గానే మిగిలిపోయావు. అందరిలోనూ ఒకే పరమాత్మ కలడని అందరిలో ఒకే ఆత్మతత్వం నిండి ఉన్నదనే విషయాన్ని కూడా నీవు తెలుసుకోలేకపోయావు. కావున నీ తపస్సు అసంపూర్ణంగా మరియు నిష్ఫలంగా మిగిలింది. కావున ఈ రోజు నుంచి నీవు ఈ బందిపోటుకి సేవ చేస్తూ, దానితోపాటు ఇతర దీనులకి కూడా సేవ చేస్తూ నీ తపస్సుని సంపూర్ణం చేసుకో, అహంకార రహితమైన తపస్సే ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి తపస్సు చివరికి ఈశ్వరప్రాప్తి, మోక్షం, ముక్తి మొదలైన వాటికి అటువంటి తపస్సు చివరికి ఈశ్వరప్రాప్తి, మోక్షం, ముక్తి మొదలైన వాటికి ఆధారంగా మారుతుంది”.

యమధర్మరాజు యొక్క జ్ఞానపూరితమైన మాటలు వినుట వలన ఆ సాధువుకి జ్ఞానోదయం అయినది. కళ్ళ నుండి పశ్చాత్తాపంతో నిండిన అశ్రువులు రావటం మరియు స్వప్నం చెదరటం జరిగింది. సాధువుకి తన తప్పు తెలిసింది. అంతర్యామి అయిన ఆ పరమాత్మ మన కర్మలన్నింటినీ చూస్తున్నాడు అని అతనికి అర్థమయ్యింది.

తనకి తపః సాధనలోనికి నిజమైన దర్శింపచేశారని అర్థమయ్యింది. ప్రభువు తనకి నిజమైన మార్గదర్శనాన్ని చేశారు. ఆరోజు నుంచి అతను అసలైన తపోసాధనలో లీనమయ్యాడు. చిత్తశు ద్ధియే సమస్త సాధనల సారం కదా!

అఖండజ్యోతి, మార్చి 2021

అనువాదం: భవానీ మాధురి అన్నపురెడ్డి

యుగశక్తి గాయత్రి – Dec 2021

You may also like