రాజ్యంలో గూడచారి పనిచేసిన నేరం క్రింద ఒక విదేశీయుని బంధించి ఉరిశిక్ష విధించారు. ఉరికంబం ఎక్కించడానికి ముందు అతడిని రాజు ముందు హాజరు పరిచారు. అతని వెంట ఒక అనువాదం చేసే వ్వక్తి కూడా ఉన్నాడు. రాజు విదేశీయుని “నీవేమైనా చెప్పుకోవలసింది ఉన్నదా?” అన్నాడు. విదేశీయుడు కోపంతో తన భాషలో రాజును నిందిస్తూ న్యాయం పేరిట కపట నాటకాలు వేసేవాడిని తిడతాడు. కాని అనువాదం చేసే వ్యక్తి రాజుతో “రాజా! ఈ నేరస్తుడు తన భార్యబిడ్డలును గుర్తుచేసుకొని రోదిస్తున్నాడు. నేరానికి మించి అధిక శిక్ష విధించారేమో (ప్రభువులు దయదలచాలని (పాధేయవదుతున్నాడు” అని మాట మార్చి చెబుతాడు. ఆ మాటలకు రాజు చలించి నేరస్తుని శిక్ష తగ్గించి అతనిని దేశ సరిహద్దులలో వదలివేయుమని ఆదేశిస్తాడు. ఇంతలో పక్కనున్న విదేశీ భాష బాగా తెలినిన మరొక అధికారిపై నిర్థయాన్ని దిక్కరిస్తూ రాజును తిట్టిన నేరానికి నేరస్తుని శిక్షపెంచాలేగాని తగ్ధించరాదని విన్నవిస్తాడు.
రాజు గంభీర స్వరంతో నీవు చెప్పినది సత్యమైతే అగుగాక కాని అపరాధియొక్క మనోభూమి, న్యాయాధీశునిగా నా కర్తవ్యం దృష్టిలో పెట్టుకొని చూస్తే మొదటి అధికారి చెప్పిన మాటల్లోనే ఎక్కువ సత్యం దృష్టి గోచరమవుతోంది. నీవు చెప్పిన సత్వం వల్ల నాలో కోవం, అపరాధికి అసంతోషం వృద్ధి చెందుతున్నాయి. అందువల్ల న్యాయం యొక్తు (ప్రామాణికత క్షీణిస్తోంది. కాబట్టి నీవు చెప్పినది ఎంతటి నగ్న సత్యమైనా దుఃఖాన్ని, క్రోధాన్ని, నిరయను వృద్ధి చేస్తున్న కారణంగా దానికి విలువనీయక మొదటి అధికారి చెప్పినదానికే విలువనీయటం సమంజసమని రాజు తెలియచేస్తాడు. * పలికే మాటలు ఎంత నత్యమైనవి, వాస్తవమైనవి అని కాక వాటి ప్రయోజనాన్ని, సత్ఫలితాలను దృష్టిలో పెట్టుకొనిసత్వా సత్య నిర్థయాలు చేస్తూ ఉందాలి. *
Source: యుగ శక్తి గాయత్రి పత్రిక జూన్ 2018For More readings..!https://www.swadhyay.awgp.org/For hard copy magazine subscription http://ow.ly/eBHl30rFkMg