హాస్యచికిత్స : ప్రముఖ వైద్య నిపుణుడు డా॥ శామ్సన్ వద్దకు ఒక రోగిని తీసుకువచ్చారు. అతడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. వైద్యం చేసేముందు ఆ డాక్టరు రోగితో నంభాషణ మొదలుపెట్టాడు. ఎంతో ఆత్మీయతతో, చిరునవ్వులు చిందిస్తూ ఆయన మాట్లాడుతూ ఉండడంతో, రోగి ముఖంలో కూడా చిరునవ్వు తొంగిచూచింది. “మీరు గాబరాపడవలసిన అవసరం లేదు. రోగికి జబ్బు నయమవుతుంది. ఎందుకంటే ఇతనికి నవ్వే సామర్థ్యం ఇంకా మిగిలి ఉంది” – అని డాక్టరు రోగితో వచ్చిన వారికి ధైర్యం చెప్పాడు. కొద్ది కాలం చికిత్స తర్వాత ఆ రోగి జబ్బు నయమయింది. రోగికి మందు మాకులు ఇవ్వడం, చికిత్స చేయడంకన్నా అతడికి ఉల్లాసం కలిగించడం, అతడు నవ్వుతూ త్రుళ్లుతూ ఉండడం, చిరునవ్వుతో కబుర్లు చెప్పడం మరింత ముఖ్యమైనవి డా॥ శామ్సన్ నమ్మకం. నవ్వు మందులకన్నా మిన్నగా పనిచేసిందని బుజువయింది. నవ్వులో యవ్వనం : తత్వవేత్త బైరన్ ఇలా వ్రాశాడు – నవ్వు యౌవనంలోని ఆనందరేఖ, యౌవన సౌందర్యం. యౌవన శృంగారం. ఈ సౌందర్యాన్నీ, శృంగారాన్నీ అనుభవించని వ్యక్తికి యౌవనం నిలచి ఉండదు.
స్టర్న్ ఇలా వ్రాశాడు – వ్యక్తి నవ్వినప్పుడల్లా, దానితోపాటు తన ఆయుష్షును పెంచుకుంటున్నాడని నా నమ్మకం. విరగడబడి నవ్వడంవల్ల, ఎప్పుడూ ఉల్లాసంగా సంతోషంగా ఉండడంవల్ల మనిషి శరీరంలోని జీర్ణక్రియ మెరుగుపడుతుందనీ, రక్త కణాలు వృద్ధిపొందుతాయనీ, నాడీ వ్యవస్థలో తాజాదనం వస్తుందనీ, ఆరోగ్యం పెరుగుతుందనీ డా॥ విలియం తన ప్రయోగాలు ఆధారంగా బుజువు చేశాడు.
నవ్వుజీవన సౌరభం : గలగలా నవ్వడం, హాస్య వినోదాలు, చిరునవ్వులు చిందించడం – ఇవి మనిషి ఆరోగ్యాన్ని చక్కబరచే అద్భుత బెషధాలు. నవ్వు జీవన సౌరభం. జాజి మొగ్గ సహజంగా విచ్చుకున్నప్పుడు దాని అందం చూడముచ్చటగా, మనోహరంగా వెలిగిపోతుంది. దర్శకుని మనస్సు దానిపట్ల ఆకర్షితం అవుతుంది. జీవితంలోని ఉపద్రవాలలో, పెనుతుఫానులలో చిక్కుకున్న మనిషికి ఆ దృశ్యం కొద్ది క్షణాల పాటు కొత్త జీవాన్ని జవాన్ని ఇస్తుంది. పసిపాపలా చిరునవ్వు నవ్వడము, హాస్య వినోదాలు చూచినప్పుడు నిరాశతో నీరసించిన వ్యక్తులలో కూడా కొత్త ఆశలు చిగురిస్తాయి. సహచరుల హాస్యవినోదాల గలగలల మధ్య మనిషి తన దుఃఖాన్ని విషాదాన్నీ మరచిపోతాడు.
సంత్ ఎమర్సన్ భావన : ప్రముఖ తత్వవేత్త ఎమర్సన్ ఇలా అన్నారు. వాస్తవానికి హాస్యంతో నవ్వించే వ్యక్తి, మానవ పథంలోని ముళ్లను, కలుపును ఏరివేసి, సద్గుణాలతో గుబాళించే మొక్కను నాటి, మన జీవన యాత్రను ఒక పర్వంగా, ఒక ఉత్సవంగా మార్చే రైతు. భయం, చింత మున్నగు మనోవికారాల వల్ల మనిషి శరీరంలో ఉత్పన్నమయ్యే విషాన్ని క్షాళన చేసేందుకు హాస్యం ఒక అద్భుత బెషధం అని మనస్తత్వ శాస్త్ర నిపుణులు, శరీరశాస్త్ర నిపుణులు తమ ప్రయోగాలు, పరిశోధనలు, అనుభవాల ద్వారా రుజువు చేశారు.
నవ్వునాలుగు విధాల మేలు : గలగలా నవ్వడం వల్ల మనిషి యొక్క శారీరక, మానసిక వ్యవస్థలలో ఉన్న ఒత్తిడి ఇట్టే మాయమౌతుంది. నవ్వడం వల్ల నరాలూ, కండరాలు ప్రత్యేకంగా ప్రభావితం అవుతాయి, క్రియాశీలకం అవుతాయి. జీర్ణ రసాన్ని సమృద్ధిగా విడుదల చేస్తాయి. ఊపిరితిత్తులలో రక్తప్రసరణ వేగంగా పెరుగుతుంది. ఉచ్చ్వాస నిశ్వాసాల వేగం కూడా పెరుగుతుంది. అందువల్ల శరీరం ప్రాణవాయువును మరింతగా స్వీకరిస్తుంది. రక్తశుద్ధి కూడా వేగంగా జరుగుతుంది. శరీరంలోని జీవనతత్వం క్రియాశీలం అవుతుంది. అందువల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. జీవితంలో ఎదురయ్యే కష్టనష్టాలు, దిగుళ్లు,సమస్యలు విషాదాలు, మానసిక అసంతులనం మున్నగు అనేకచిక్కుముడులు హాస్య వినోదాల స్పర్శ తగలగానే మటుమాయంఅయిపోతాయి. హాస్య ప్రధానుడైన వ్యక్తి జీవితంలోని పెద్ద పెద్ద ఇక్కట్లను, విషమ సమస్యలను చక్కగా ఎదుర్కోగలుగుతాడు. జీవనసంగ్రామంలో నవ్వుతూ విజయం సాధించగలుగుతాడు.
యుగ శక్తి గాయత్రి 2011మార్చ్